...
...
Next Story

తిరుమల శ్రీవారి లడ్డూ ధర పెంపు వార్తలు - టీటీడీ ఇచ్చిన క్లారిటీ ఇదే..!

తిరుమల శ్రీవారి లడ్డూ ధరలు పెరుగుతున్నట్లు కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే దీనిపై టీటీడీ స్పందించింది. ఇలాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. భక్తులు వీటిని నమ్మవద్దని కోరింది. ఈ మేరకు ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

Published on: Oct 18, 2025, 16:10:34 IST
Advertisement

శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల విషయంలో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే వీటిపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. కొందరు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని తెపింది. లడ్డూ ప్రసాదాల ధరలను పెంచే ఆలోచనే లేదని స్పష్టం చేసింది.

ఆ ఆలోచనే లేదు - టీటీడీ ఛైర్మన్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం

ఇందుకు సంబంధించి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి చౌకబారు వార్తలను ప్రచారం చేయడం తగదన్నారు. ఇలాంటి వార్తలు పూర్తి అబద్దమైనవని చెప్పారు. ఆధారాలు లేని వార్తలని తీవ్రంగా ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీకి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచే ఆలోచనే లేదన్నారు.

శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కోసం దళారులను నమ్మి మోసపోవద్దని టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు శనివారం భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవలి కాలంలో కొందరు దళారులు, మధ్యవర్తులు శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను పలు మార్గాల ద్వారా మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

ముఖ్యంగా టిటిడిలోను, ప్రభావిత స్థానాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులమని కొందరు మాయమాటలతో మెరుగైన శ్రీవారి బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కల్పిస్తామని ప్రలోభ పెడుతున్నట్లు భక్తుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి నకిలీ వ్యక్తులు భక్తుల నుండి భారీ మొత్తాలు వసూలు చేసి మోసం చేస్తున్నట్లు అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే భక్తులను మోసం చేస్తున్న దళారులను టిటిడి గుర్తించి సదరు దళారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks