...
...
Next Story

TTD Recruitment : టీటీడీలో ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ - మే 10, 11 తేదీల్లో రాత పరీక్షలు

TTD Engineering Recruitment 2026 : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 29లోగా పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలి.

Published on: Apr 24, 2026 10:32 PM IST
Advertisement

TTD Engineering Recruitment : ఇంజినీరింగ్ విభాగంలోని పోస్టుల భర్తీకి సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో రాత పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షల ద్వారా ఏఈఈ (సివిల్), ఏఈఈ (ఎలక్ట్రికల్), ఏఈ (సివిల్), ఏటీవో (సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ వివరాలను వెల్లడించింది.

టీటీడీలో ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ - మే 10, 11 తేదీల్లో పరీక్షలు
టీటీడీలో ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ - మే 10, 11 తేదీల్లో పరీక్షలు

తిరుమలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆలయ నిర్మాణాలు, మరియు నిర్వహణ పనుల్లో ఇంజినీరింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఈ విభాగంలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పరీక్షల పూర్తి షెడ్యూల్

అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను రెండు రోజుల్లో వివిధ షిఫ్టుల వారీగా విభజించారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి:

  • మే 10, 2026 (ఆదివారం): ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు: ఏఈఈ (సివిల్) పరీక్ష
  • మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5.00 వరకు: ఏఈఈ (ఎలక్ట్రికల్) పరీక్ష.
  • మే 11, 2026 (సోమవారం): ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు: ఏఈ (సివిల్) పరీక్ష.

పరీక్షా కేంద్రాల ఎంపికకు గడువు

ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమకు అనువైన పరీక్షా కేంద్రాలను ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత సెంటర్లను మార్చుకోవడానికి లేదా ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి అభ్యర్థులు వెంటనే టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ ప్రాధాన్యతలను నమోదు చేసుకోవాలి.

మరింత సమాచారం కోసం లేదా ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttd-recruitment.aptonline.in/ ను సందర్శించవచ్చు. సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం లేదా ఇతర వివరాల కోసం 155257 అనే కాల్ సెంటర్ నంబర్‌ను సంప్రదించాలని టీటీడీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు వెల్లడించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe