దేశంలోని వివిధ ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదికను రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్గత ఆడిట్ సమావేశంలో ఆయన సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. టీటీడీ కల్యాణ మండపాలు ఆదరణలో ఎన్ని ఉన్నాయి, ఆదరణ లేనివి ఎన్ని, ఆధునీకరించినవి ఎన్ని, తదితర స్థితిగతులు, భక్తులు సౌకర్యవంతంగా వినియోగించుకోవడానికి సమగ్ర విధానాన్ని రూపొందించి టీటీడీ పాలక మండలికి నివేదించాలని తిరుపతి జేఈవోను ఆదేశించారు. టీటీడీ ఆలయాలలోని తిరువాభరణ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసి డాక్యుమెంటను రూపొందించాలన్నారు ఈవో సింఘాల్. అలాగే టీటీడీలోని అన్ని విభాగాలలోని మౌలిక వసతులకు సంబంధించి టూల్స్ అండ్ ప్లానింగ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.
తిరుమల, తిరుపతిలోని వసతి గృహాలలో ఎఫ్.ఎం.ఎస్‌కు సంబంధించి ఇప్పటికే ఉన్న యాప్‌ను భక్తులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. భక్తులు ఆ యాప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసి, తమ అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ వసతి గృహాలలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవలను మరింత మెరుగుపరచి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
టీటీడీ భూములు, స్థలాలు, ఇతర ఆస్తులపై స్థిరమైన, కచ్చితమైన రికార్డులు రూపొందించేందుకు నిపుణుల సహకారం తీసుకోవాలని సూచించారు. టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులకు దర్శన టికెట్లు, ఆర్జిత సేవలలో పాల్గొనే భక్తులకు బహుమానాల జారీ కోసం టికెట్ స్కానింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు.
ఇంజనీరింగ్ విభాగంలో గుత్తేదారులకు సకాలంలో చెల్లింపులు చేపట్టాలని, టీటీడీ వేద పాఠశాలల్లో బోధనా సిబ్బందిని భర్తీ చేయాలని, అటవీ విభాగంలో ఇంకా పూర్తి కాని పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. అలాగే టీటీడీ ఆలయాలు, వసతి గృహాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు.
{{/usCountry}}ఇంజనీరింగ్ విభాగంలో గుత్తేదారులకు సకాలంలో చెల్లింపులు చేపట్టాలని, టీటీడీ వేద పాఠశాలల్లో బోధనా సిబ్బందిని భర్తీ చేయాలని, అటవీ విభాగంలో ఇంకా పూర్తి కాని పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. అలాగే టీటీడీ ఆలయాలు, వసతి గృహాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు.
{{/usCountry}}ఈ సమీక్షా సమావేశంలో టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం, సీవీఎస్వో కే.వి.మురళీకృష్ణ, ఎఫ్.ఏ.అండ్ సీఏవో ఓ.బాలాజీ, సీఈ టి.వి.సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.