శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిని వేగంగా పూర్తి చేయాలి – టీటీడీ ఈవో

అలిపిరిలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిని వేగంగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కొత్తగా నిర్మిస్తున్న జీ + 6 నూతన ఆసుపత్రి భవనంలోని పనులను స్వయంగా పరిశీలించారు.

Published on: Jan 8, 2026, 16:25:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్నివేగంగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను, నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు.

టీటీడీ ఈవో పరిశీలన
టీటీడీ ఈవో పరిశీలన

నిర్మాణ పనుల పరిశీలన….

ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ…. నూతన ఆసుపత్రి భవనం పూర్తి అయ్యే సమయానికి భవనానికి అవసరమయ్యే మానవ వనరులు, ఆపరేషన్ యంత్రాలు, ఫర్నీచర్, విద్యుత్ , తదితర మౌళిక సదుపాయాలను ముందస్తుగా సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న జీ + 6 నూతన ఆసుపత్రి భవనంలో వైద్య సేవలు, పరిపాలన కోసం ఒక్కొక్క ఫ్లోర్ లో ఏ ఏ అంతస్తును ఉపయోగిస్తున్నారని… ప్రతి ఫ్లోర్ ను పరిశీలించారు. 6వ ఫ్లోర్ లో పూర్తిగా ఆపరేషన్ ల కోసం వినియోగించనున్నట్లు, 7వ ఫ్లోర్ కేవలం హెలిపాడ్ కోసం ఉపయోగించనున్నట్లు వైద్యులు డా. ఎన్. శ్రీనాథ్ రెడ్డి వివరించారు.

ఆసుపత్రి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా నూతన ఆసుపత్రిని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. అంతకుముందు శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను టిటిడి ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ల ద్వారా రోగులకు అందిస్తున్న సేవలపై సిబ్బందితో మాట్లాడారు. ఆన్ లైన్ నమోదు, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ముందుగా ఫార్మసీ స్టోర్ ను పరిశీలించారు. అటు తర్వాత గుండె సంబంధ శస్త్ర చికిత్సలు చేసుకున్న అనంతపురం, ప్రొద్దుటూరు, చిత్తూరు, కాకినాడ, తెనాలి, రాయచోటి, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన చిన్నారులు, వారి సంరక్షకులతో మాట్లాడారు.

శ్రీపద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి అందిస్తున్న వైద్యసేవలపై చిన్నపిల్లల సంరక్షకులు సంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలుకు చెందిన భరత్ కు గుండె మార్పిడి చికిత్స చేసినట్లు ఆసుపత్రి డైరెక్టర్ శ్రీ ఎన్. శ్రీనాథ్ రెడ్డి టిటిడి ఈవోకు వివరించారు. ఇప్పటి వరకు 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు, 23 గుండె మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు వివరించారు.

ఆ తర్వా ఐసీయూ – 1లోని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గుండెకు ఉన్న రంద్రాలను సరిచేసే క్యాత్ ల్యాబ్ మిషన్ ను, ఐసియూ -2లోని ఐసోలేషన్ గదిని, ఐసియూ – 3, జనరల్ వార్డులలో చికిత్స పొందిన చిన్నారులను ఈవో పరిశీలించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More