తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా రథోత్సవం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం రథోత్సవం కన్నులపండుగగా జరిగింది.

Published on: Nov 24, 2025, 14:47:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం రథోత్సవం కన్నులపండుగ‌గా జరిగింది. ఉదయం 09.15 గంటలకు ధనుర్ లగ్నంలో ర‌థోత్సవం మొద‌లై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం.

వైభవంగా రథోత్సవం
వైభవంగా రథోత్సవం

రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు, భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం అని ప్రకటనలో టీటీడీ పేర్కొంది. రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మవారికి రథమండపంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకరించారు. రాత్రి అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇస్తారు.

మరోవైపు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 25వ తేదీ పంచమీ తీర్థానికి టీటీడీ ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తోంది. పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, ప‌ద్మపుష్కరిణిలోనికి ప్రవేశ, నిష్క్రమ‌ణ గేట్లు, సూచిక బోర్డులు త‌దిత‌ర ఇంజినీరింగ్ ప‌నులు పూర్తయ్యాయి. తిరుచానూరుకు వచ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ భ‌ద్రత, నిఘా విభాగం ప‌టిష్టమైన భ‌ద్రతా ఏర్పాట్లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా టిటిడి భ‌ద్రతా సిబ్బంది 600 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200, ఎన్‌.సి.సి.విద్యార్థులు 200, శ్రీ‌వారి సేవ‌కులు 900, పోలీస్ సిబ్బంది 1600 మందితో భ‌ద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

భ‌క్తుల సౌక‌ర్యార్థం దాదాపు 150 అన్నప్రసాదం కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. తోళ్ళప్ప గార్డన్స్‌లో 50, ఎస్వీ హైస్కూల్ వ‌ద్ద -15, శ్రీ అయ‌ప్పస్వామివారి (నవజీవన్ ఆసుపత్రి)ఆల‌యం వ‌ద్ద – 45, పూడి ఏరియాలో – 25., గేట్ – 4లో ఎమర్జెన్సీ – 15 అన్నప్రసాదం కౌంట‌ర్లలో పంపిణీ చేస్తారు. అదేవిధంగా క్యూలైన్లలోని భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన త్రాగునీరు, అల్పాహ‌రం, అన్నప్రసాదాలు, మ‌జ్జిగ‌ పంపిణీ చేస్తారు.

ఇందులో భాగంగా 284 శాశ్వత, తాత్కాలికం, మొబైల్‌ మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇందుకు అవ‌స‌ర‌మైన అద‌న‌పు పారిశుద్ధ్య సిబ్బందిని నియ‌మించారు. అమ్మవారి ద‌ర్శన స‌మ‌యం, అన్నప్రసాదాలు, మ‌రుగుదొడ్లు, పార్కింగ్ త‌దిత‌ర ప్రాంతాల‌ను భ‌క్తులు సుల‌భంగా గుర్తించేందుకు వీలుగా వివిధ ప్రాంతాల‌లో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More