అమరావతిలో పవిత్ర హారతి ఇచ్చేందుకు టీటీడీ చర్యలు.. ఇందుకోసం ప్రత్యేక కమిటీ!
అమరావతిలో పవిత్ర హారతి ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు టీటీడీ అధికారుల కమిటీ పరిశీలించి నివేదిక పంపించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో పవిత్ర హారతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గంగా నది తీరంలోని కాశీలో, ఉజ్జయినిలో నిర్వహిస్తున్న పవిత్ర హారతులతో పాటు ఇతర ప్రాంతాలలో ఎక్కడెక్కడ పవిత్ర హారతులు ఇస్తున్నారో టీటీడీ అధికారుల కమిటీ పరిశీలించి నివేదిక రూపొందించాలని సూచించారు. వేద మంత్రోచ్ఛారణలు, దీపాల కాంతులు, ఘంటానాదాల మధ్య పవిత్ర హారతి కార్యక్రమం భక్తులకు మరింత దైవనానుభూతిని పెంచుతుందని, టీటీడీ అధికారుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల రాజధానులలో టీటీడీ శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ఆయా చీఫ్ సెక్రటరీలకు ఉత్తరాలు రాశామని, సదరు అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈవో సూచించారు. గౌహతి, బెల్గాం ప్రాంతాలలో భూ కేటాయింపులపై సంబంధిత అధికారులతో చర్చించాలన్నారు.
ఈ నెలాఖరులో వేదపారాయణ దారులకు, పోటు వర్కర్లకు వేర్వేరుగా శిక్షణ ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు ఈవో సింఘాల్. టీటీడీలోని 59 అనుబంధ, స్థానిక ఆలయాలలో 1004 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, ఇప్పటికే 794 కెమెరాలు కార్యరూపంలో ఉన్నాయన్నారు. మిగిలిన చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా స్థానిక, అనుబంధ ఆలయాలలో అన్నప్రసాద వితరణ చేసే దాతల పేర్లు ఎల్.ఈ.డీ స్క్రీన్‌లలో డిస్ ప్లే అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి అవసరమైన భూమి కోసం ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అదేవిధంగా విద్యా శాఖ, వైద్య , న్యాయ శాఖ , ఫారెస్ట్ , ఇంజనీరింగ్ విభాగాల లో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి.మురళీకృష్ణ, ఎఫ్.ఏ.అండ్ సీఏవో ఓ. బాలాజీ, సీఈ టి.వి. సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


