ఆ రోజున తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు 10 గంటలు క్లోజ్.. ఈ సేవలు క్యాన్సిల్!

చంద్ర గ్రహణం కారణంగా మార్చి 03న తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తలుపులు 10 గంటలకు పైగా మూసివేస్తారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

Published on: Jan 4, 2026, 14:28:49 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 మార్చి 3న చంద్రగ్రహణం వస్తుంది. మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు దాదాపు మూడున్నర గంటలు ఉంటుంది. గ్రహణానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఒక సంప్రదాయం. మార్చి 03న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు తిరుమల ఆలయ తలుపులు మూసివేస్తారు. మార్చి 03న రాత్రి 8:30 గంటల తర్వాత శుద్ధి, ఇతర శుద్ధి ఆచారాల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

తిరుమల
తిరుమల

చంద్రగ్రహణం కారణంగా భక్తులపై అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 18వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

జనవరి 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. జనవరి 28న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. వాహన సేవలలో భాగంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం 09.00 గం.ల నుండి 10.00 గం.ల వరకు రాత్రి 08.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భ‌క్తి సంగీత‌ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు

  • 19.01.2026 ఉదయం – ధ్వజారోహణం (మీన లగ్నం) రాత్రి – చంద్రప్రభ వాహనం
  • 20.01.2026 ఉద‌యం – సూర్యప్రభవాహనం రాత్రి – పెద్దశేష వాహనం
  • 21.01.2026 ఉద‌యం – చిన్నశేష వాహనం రాత్రి – సింహ వాహనం
  • 22.01.2026 ఉద‌యం – కల్పవృక్ష వాహనం రాత్రి – హనుమంత వాహనం
  • 23.01.2026 ఉద‌యం – ముత్యపుపందిరి వాహనం రాత్రి – గరుడ వాహనం
  • 24.01.2026 ఉద‌యం – కల్యాణోత్సవం రాత్రి – గజ వాహనం
  • 25.01.2026 ఉద‌యం – రథోత్సవం రాత్రి – ధూళి ఉత్సవం
  • 26.01.2026 ఉద‌యం – సర్వభూపాల వాహనం రాత్రి – అశ్వ వాహనం
  • 27.01.2026 ఉద‌యం – వసంతోత్సవం, చక్రస్నానం రాత్రి – హంసవాహనం, ధ్వజావరోహణం
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More