శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ ఇచ్చింది. అలిపిరిలోని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు ఈ టికెట్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు:

{{^htLoading}} {{/htLoading}}
వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 నుండి జనవరి 08 వరకు భక్తులకు కల్పించనున్నారు. 10 రోజుల పాటు 8 లక్షల మంది భక్తుల కోసం వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా టీటీడీ అధికారులు తెలిపారు.
- వైకుంఠ ద్వార దర్శనం కోసం అందుబాటులో ఉన్న 182 గంటల్లో 164 గంటలు సాధారణ భక్తులకు కేటాయించారు.
- ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ లేదు. మొదటి మూడు రోజులు శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు లేవు.
- ఈ డిప్ ద్వారా సేకరించిన టోకెన్లు కలిగిన భక్తులకు మొదటి మూడు రోజులలో అనుమతి ఉంటుంది.
- జనవరి 02 నుండి 08 వరకు భక్తులు సర్వ దర్శనం ద్వారా దర్శనం చేసుకోవచ్చు
- జనవరి 02 నుండి 08 వరకు ఆన్‌లైన్‌లో భక్తులకు ప్రతిరోజు 15000 రూ.300 టోకెన్లు, 1000 శ్రీవాణి టిక్కెట్లు కేటాయిస్తారు.
- ఆన్‌లైన్ FIFO ద్వారా జనవరి 06, 07, 08 తేదీల్లో స్థానిక దర్శన్ (ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతి)లో ఉంటుంది.
- సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా డిసెంబర్ 30, 31, జనవరి 01 తేదీలలో మొదటి మూడు రోజులలో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనం రద్దు చేశామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే తెలిపారు.
- నవంబర్ 27 నుండి డిసెంబర్ 01 వరకు దర్శన టోకెన్ల నమోదుకు భక్తులకు అవకాశం కల్పిస్తారు.
- డిసెంబర్ 2న ఈ-డిప్ ద్వారా ఎంపికైన వారికి దర్శన టోకెన్లు కేటాయిస్తారు. అందరికీ సమాన అవకాశాన్ని పారదర్శకంగా అందించడానికి, టోకెన్ల జారీని టీటీడీ అధికారిక వెబ్‌సైట్, టీటీడీ మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నిర్వహిస్తారు.
- తిరుపతి, తిరుమల స్థానికులకు జనవరి 6,7,8 తేదీలలో ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ప్రాతిపదికన 5,000 టోకెన్లు అందిస్తారు.
{{^htLoading}} {{/htLoading}}