టీటీడీ ఆడిషన్లు : తిరుమల శ్రీవారి సేవలో భాగమయ్యే అవకాశం - దరఖాస్తు చేసుకోండిలా!

Tirumala Dasa Sahitya Auditions : తిరుమల, తిరుపతి ఆలయాల్లో సంకీర్తనలు ఆలపించేందుకు అర్హులైన సంగీత కళాకారుల నుంచి టీటీడీ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగస్టు 1 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 25, 2026, 15:11:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tirumala Dasa Sahitya Auditions : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య క్షేత్రంలో భాగమయ్యేందుకు, స్వామివారి సేవలో తరించేందుకు సంగీత కళాకారులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. తిరుమలలో ప్రతిరోజూ అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీవారి సహస్ర దీపాలంకార సేవలో, అలాగే తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నిర్వహించే దాససాహిత్య సంకీర్తనలను గానం చేసేందుకు గానూ ప్రతిభావంతులు, అర్హులైన సంగీత కళాకారుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

టీటీడీ ఆడిషన్లు : తిరుమల శ్రీవారి సేవలో భాగమయ్యే అవకాశం - దరఖాస్తు చేసుకోండిలా!
టీటీడీ ఆడిషన్లు : తిరుమల శ్రీవారి సేవలో భాగమయ్యే అవకాశం - దరఖాస్తు చేసుకోండిలా!

నవంబరులో ఆడిషన్లు….

ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ఆడిషన్లను 2026 నవంబరు 27వ తేదీ నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు మొత్తం ఆరు రోజుల పాటు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ ఆడిషన్లలో పాల్గొని తమ స్వర మాధుర్యంతో స్వామివారిని పూజించాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ వివరాలను సమర్పించేందుకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ( https://apps.tirumala.org/dsp / ), ( https://apps.tirumala.org/dsp/ ) పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు.

అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, ఆడిషన్స్ నిర్వహణ విధానం, దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన ముఖ్యమైన ధ్రువపత్రాలు వివరాలు కూడా టీటీడీ వెబ్ సైట్ లో ఉన్నాయి. అంతేకాకుండా అడ్మిషన్లు మార్గదర్శకాలు, ఇతర నిబంధనలకు సంబంధించిన అన్ని వివరాలను కూడా పొందుపరిచారు.

దళారులను నమ్మవద్దు - టీటీడీ

ఈ ఆడిషన్స్ ప్రక్రియపై టీటీడీ అధికారులు ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించి టీటీడీ ఎటువంటి ఏజెంట్లను, మధ్యవర్తులను లేదా ప్రతినిధులను నియమించలేదని అత్యంత స్పష్టంగా వెల్లడించారు. అభ్యర్థులు ఎవరూ అనధికార వ్యక్తులను లేదా దళారులను నమ్మి మోసపోవద్దని, కేవలం టీటీడీ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సురక్షితంగా సమర్పించాలని కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More