తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిటీ - సీఎం చంద్రబాబు ప్రకటన
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నివేదికలన్నీ ఏకసభ్య కమిటీ ఎదుట ఉంచుతామని తెలిపారు.
తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు సిట్ ఇచ్చిన నివేదికలోని పలు అంశాలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వాన్ని వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. మరోవైపు సీబీఐ నేతృత్వంలోని సిట్… వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదంటూ కూటమి నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే… కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది.

లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు ఇవాళ కీలక భేటీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఏకసభ్య కమిటీ ఏర్పాటుపై ప్రకటన చేశారు.
నెయ్యి కల్తీపై 2022లో నివేదిక వస్తే అప్పటి పాలకులు ఎందుకు తొక్కిపెట్టారు? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తప్పు జరుగుతోందని తెలిసి కూడా దాన్ని కొనసాగించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రక్షాళన మొదలుపెట్టామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు దేవుడంటే లెక్కలేనితనమనుకోవాలా…?విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనేదే వారి లక్ష్యమా? అని నిలదీశారు.,
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం భక్తుల విశ్వాసానికి విఘాతం కలిగించే ఘోరమైన నేరమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏ నివేదిక కూడా వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు.
నివేదికలన్నీ సమర్పిస్తాం - సీఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఏకసభ్య కమిటీ ముందు నివేదికలన్నీ ఎదుట ఉంచుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. తప్పు చేసిన ఎవరినీ వదిలేది లేదన్నారు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. సీబీఐ నివేదికపై ఏకసభ్య కమిటీ విచారణ చేస్తుందని చెప్పుకొచ్చారు.
“ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. శ్రీ వేంకటేశ్వర స్వామి మా ఇంటిదైవం గత పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుంది. బూతులు మాట్లాడుతూ, రౌడీయిజం చేస్తూ, మేము అనుకున్నదే ప్రజలు వినాలి,=… చూడాలి అంటే, చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు.కరుడుగట్టిన నేరస్థుడు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించాలని చేస్తాడో…అదే వైఎస్ జగన్ చేస్తున్నాడు..తిరుమల లడ్డూ కల్తీ అనేది, డబ్బుల కోసం చేసింది కాదు…. ఇది హిందూ మతం పై ఒక పెద్ద కుట్ర. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బ తీసే కుట్ర”అని సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

