తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ వెల్లడించింది. నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 మధ్య వివిధ ట్రస్టులకు రూ.918.6 కోట్ల విరాళాలు అందాయని వివరించింది.

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ…. ట్రస్టులకు విరాళాలు క్రమంగా పెరిగాయన్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో ఈ విరాళాలను ఇస్తున్నారని చెప్పారు. అందుకున్న విరాళాల్లో రూ.579.38 కోట్లు ఆన్లైన్ ద్వారా రాగా… మరో రూ.339.20 కోట్లు ఆఫ్ లైన్ మార్గంలో వచ్చాయని ప్రకటించింది.
విరాళాల వివరాలు ఇలా….
వచ్చిన వాటిల్లో అన్నదానం ట్రస్టుకు అత్యధికంగా రూ.339 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.252 కోట్లు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.98 కోట్లు అందాయి. ఎస్వీ ప్రాణాదన ట్రస్టుకు రూ.67 కోట్లు, ఎస్వీ గోసారక్షన ట్రస్టుకు రూ.56 కోట్లు, ఎస్వీ విద్యాదనం ట్రస్టుకు రూ.33.47 కోట్లు ముట్టాయి. ఇక బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిజేబుల్డ్స్ (బర్డ్) ట్రస్టుకు రూ.30 కోట్లు, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్టుకు రూ.20.46 కోట్లు వచ్చాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ఎస్ నాయుడు తెలిపారు.
ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.13.87 కోట్లు, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ)కి రూ.6.29 కోట్లు, శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్వీఐఎంఎస్)కు రూ.1.52 కోట్లు విరాళంగా ఇచ్చారు. విరాళాల కోసం ఎక్కువ మంది దాతలు ఆన్ లైన్ మార్గానికే ఆసక్తి చూపుతున్నారని ఆయన ఛైర్మన్ వివరించారు. ఆలయ నిర్మాణ పనులు, యంత్రాల కొనుగోలు, సాంకేతిక అభివృద్ధికి కూడా సహకరిస్తున్నారని తెలిపారు.
ట్రస్టులకు వారి మద్దతును పరిగణనలోకి తీసుకుని…. దాతలకు తగిన గౌరవం మరియు సరైన సౌకర్యాలు కల్పిస్తాని ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారం పంపిణీ, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలకు మద్దతు, వైదిక అభ్యాస పరిరక్షణ మరియు ప్రచారంతో సహా స్వచ్ఛంద విధులను నిర్వహించడానికి టీటీడీ బహుళ ట్రస్టులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
{{/usCountry}}తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారం పంపిణీ, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలకు మద్దతు, వైదిక అభ్యాస పరిరక్షణ మరియు ప్రచారంతో సహా స్వచ్ఛంద విధులను నిర్వహించడానికి టీటీడీ బహుళ ట్రస్టులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
{{/usCountry}}తిరుమలలోని ప్రఖ్యాత వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే ఆలయాల్లో ఒకటి. హిందూ పుణ్యక్షేత్రాలలో అగ్రస్థానంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మంది యాత్రికులు వస్తుంటారని అంచనా…!