...
...
Next Story

టీటీడీ : అలిపిరి దగ్గర నాన్ వెజ్ ఫుడ్ తిన్నందుకు ఇద్దరు ఉద్యోగులు తొలగింపు!

అలిపిరి దగ్గర నాన్ వెజ్ ఫుడ్ తిన్నందుకు ఇద్దరు అవుట్‌సోర్స్ ఉద్యోగులను టీటీడీ తొలగించింది. అలిపిరి మెట్ల మార్గం దగ్గర మాంసాహారం తిన్నట్టుగా గుర్తించారు.

Published on: Nov 10, 2025, 12:31:35 IST
Advertisement

అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నారనే ఆరోపణలతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ విషయంలో తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. 'అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నందుకు ఇద్దరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు రామస్వామి, సరసమ్మపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంది.' అని టీటీడీ అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 114 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

టీటీడీ
టీటీడీ

ఆదివారం అలిపిరి వద్ద మాంసాహారం తిన్నారనే ఆరోపణలతో టీటీడీ ఈ చర్యలు తీసుకుంది. ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. తిరుమల కొండ ప్రాంతంలో మాంసాహారం, పొగాకు వినియోగం కచ్చితంగా నిషేధం ఉంది. ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే కచ్చితంగా చర్యలు తీసుకుంటారు.

ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రామస్వామి, సరసమ్మలను మెట్లమార్గంలో మాంసాహారం తింటుండగా.. తిరుమలకు వెళ్తున్న భక్తులు వీడియోలు తీశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కార్మికులపై టీటీడీ చర్యలు తీసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమలలో తప్పిదాలు, సంప్రదాయ ఉల్లంఘనలను ఉపేక్షించేది లేదని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలపై దుష్ప్రచారం చేసినా.., స్వామివారి పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసినా..ఊరుకునేది లేదని హెచ్చరించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe