...
...
Next Story

TTD : ఆగస్టు 5 నుంచి 14 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉత్సవాలు

TTD : ఆగస్టు 5 నుంచి 14 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

Published on: Aug 3, 2026, 21:29:21 IST
Advertisement

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 5 నుండి 14వ తేదీ వరకు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తులు అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందనున్నారు.

టీటీడీ
టీటీడీ

ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆగస్టు 14న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి మహోత్సవ ఊరేగింపుగా తీసుకువెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక పూజల తర్వాత అలిపిరి నుండి రామనగర్ క్వార్టర్స్‌లోని గీతా మందిరం, ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్‌ మఠం మీదుగా దివ్య ఊరేగింపు ఆలయానికి చేరుకుంటుంది.

రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహించి ఉత్సవాలకు మంగళం పలుకుతారు. ఈ దివ్యోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా ఆడికృత్తిక ఉత్సవం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 7వ తేదీన ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి విశేష ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.

అనంతరం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి తిరువీధి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టీటీడీ అధికారులు కోరారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe