TTD e Auction : ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తమ ఆలయాలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. టీటీడీ అనుబంధ ఆలయాలలో 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు ఒక ఏడాది కాలంలో వాడిన మూడు రకాల ఖాళీ గోనె సంచులను విక్రయించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ సంచులను “రేట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన” విక్రయించేందుకు వీలుగా ఒక బహిరంగ ఈ-వేలం (e-Auction) నిర్వహించనున్నారు.

ఈ వేలం ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం సాగనుంది. ఆసక్తి కలిగిన వ్యాపారులు, వ్యక్తులు పేర్లు నమోదు చేసుకుని ఈ వేలంలో పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన డిజిటల్ వేలం ప్రక్రియ 2026 జూన్ 30న అధికారికంగా ప్రారంభమవుతుంది.
ఈ వేలంలో పాల్గొనడానికి కొన్ని నిబంధనలను విధించారు. వేలంలో భాగస్వాములు కావాలనుకునే వారు రూ.75,000/- (డెబ్బై ఐదు వేల రూపాయలు) ధరఖాస్తు రుసుము లేదా అర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) కింద చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు తెలుసుకోవడానికి ఆసక్తి గలవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక కొనుగోలు పోర్టల్ https://konugolu.ap.gov.in ను సందర్శించవచ్చు. ఒకవేళ సాంకేతిక సమస్యలు లేదా ఇతర సందేహాలు ఉంటే నేరుగా తిరుపతిలోని టిటిడి జనరల్ మేనేజర్ (వేలాలు) కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇందుకోసం కార్యాలయ ఫోన్ నంబర్: 0877-2264429 లేదా ఈ-మెయిల్ ఐడీ gmauctionsttd@gmail.com ద్వారా అధికారులను సంప్రదించి పూర్తి సమాచారాన్ని సేకరించవచ్చు.