Tirumala Updates : శ్రీవారి ఆలయం వస్త్రాలకు టీటీడీ ఈ-వేలం తేదీలు ఇవే.. ఎలా పాల్గొనాలంటే?
TTD Updates : భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను వేలం వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ జరగనుంది. ఆసక్తి ఉన్నవారు పాల్గొనవచ్చు.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు కొత్తవి/ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్నవి (287) లాట్ల ఆర్ట్ సిల్క్ చీరల, హాఫ్ సారీస్, సిల్క్ చీరలు, ఆర్డినరీ చీరలు తేదీ 02.03.2026 నుండి 09.03.2026 తేదీ వరకు టీటీడీ ఆన్‌లైన్‌లో EA ID Nos 25597 నుండి 25602, 25604 నుండి 25609 ద్వారా ఈ-వేలం వేయనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-కొనుగోలు పోర్టల్‌లో రిజిస్టర్ అయిన ఆసక్తి కల్గిన బిడ్డర్లు వస్త్రాల ఆన్‌లైన్ వేలంలో పాల్గొనడానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్(వేలం), ఏఈవో ( వేలం), టీటీడీ, హరేకృష్ణ మార్గ్ తిరుపతి, https://konugolu.ap.gov.in లేదా టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org లేదా 0877-2264429 / 9959988470 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
వార్షిక బ్రహ్మోత్సవాలు
గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలో ఫిబ్రవరి 28 నుండి మార్చి 04వ తేదీ వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 24వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడుతారు. ఫిబ్రవరి 28వ తేదీన సాయంత్రం 06.00 గం.లకు భగవతారాధన, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్యంగ్రహణం, అంకురార్పణం, గరుడ అధివాసం, నివేదన, బలిహరణ, మంగళ శాసనం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు.
మార్చి 1వ తేదీన ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 01వ తేదీన ఉదయం 05 గంటలకు సుప్రభాతం, పంచామృత అభిషేకం, అలంకరణ, నివేదన, అర్చన సేవలను స్వామి వారికి చేపడుతారు. ఉదయం 08 గం.లకు దేవత ఆహ్వానం, భేరిపూజ అనంతరం ఉదయం 09 గం.లకు మేషలగ్నంలో ధ్వజారోహణంను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గం.లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 05 గం.లకు ఊంజల్ సేవ చేపడతారు. రాత్రి 07 గం.లకు అశ్వ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
మార్చి 02వ తేదీ రాత్రి 07 గం.ల నుండి 09.00 గం.ల వరకు శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. మార్చి 03వ తేదీ ఉదయం 4 గం.ల నుండి ఉదయం 9 గం.ల వరకు చక్రస్నానం, మహా పూర్ణాహుతి, రాత్రి 7 గం.లకు గరుడ సేవ, రాత్రి 09.00గం.లకు ధ్వజావరోహణం, మార్చి 04వ తేదీ సాయంత్రం 5 గం.ల నుండి 9.30 గం.ల వరకు శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన చేపడుతారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వాహన సేవల ముందు ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


