ఏపీకి కేంద్రం శుభవార్త - ఆరు లైన్లతో భారీ కనెక్టివిటీ హైవే..! రూ.573 కోట్లు మంజూరు
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. మచిలీపట్నం పోర్ట్, నేషనల్ హైవే మధ్య కనెక్టివిటీ కోసం రహదారి నిర్మించనుంది. ఇందుకోసం ఏకంగా రూ. 573.77 కోట్లు మంజూరు చేసింది. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను చెప్పింది.మచిలీపట్నం పోర్ట్, నేషనల్ హైవే మధ్య కనెక్టివిటీ కోసం భారీ రహదారిని నిర్మించనుంది. ఆరు లైన్ల రోడ్డు నిర్మాణ కోసం ఏకంగా రూ. 573.77 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

6 లైన్ల హైవే…
కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ తెలిపిన వివరాల ప్రకారం…. NH-65, 216 జంక్షన్ నుంచి మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి రూ.573.77 కోట్లు మంజూరు నిర్ణయాన్ని ఆమోదించారు . 6 వరుసల ప్రధాన హైవేతోపాటు, సర్వీస్ రోడ్లు, మూడు చోట్ల ఫ్లైఓవర్లు, ఓ రైల్వే వంతెన నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ మచిలీపట్నం పోర్టు - జాతీయ రహదారి కారిడార్ మధ్య అనువైన కెనక్టివిటీని ఏర్పాటవుతుంది. సరుకు రవాణా సమయం గణనీయంగా తగ్గుతుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించటంతో పాటు మొత్తం లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది.
కేంద్రం చేపట్టబోయే ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా భారీ కంటైనర్ల రాకపోకలు సులభతరం కానున్నాయి. ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్ల వల్ల స్థానికంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సరుకు రవాణా సాగుతుంది. అలాగే ఈ అనుసంధానం ద్వారా మచిలీపట్నం ప్రాంతం ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ ముఖ్య ప్రయోజనాలు:
- పోర్ట్‌కు నేషనల్ హైవే కారిడార్‌తో నేరుగా, నిరంతర అనుసంధానం
- సరుకు రవాణా సమయం గణనీయంగా తగ్గింపు
- ట్రాఫిక్ రద్దీ నియంత్రణ
- లాజిస్టిక్స్ సామర్థ్యం మరియు వాణిజ్య వేగం పెంపు
ఆమోదించిన పనుల పరిధి:
- 6-లేన్ ప్రధాన రహదారి
- సర్వీస్ రోడ్లు
- 3 ఆధునిక ఫ్లైఓవర్లు
- ఓవర్‌పాస్-కమ్-రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ (ROB)
సీఎం చంద్రబాబు హర్షం…
కీలకమైన ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపటంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి గడ్కరీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుల కనెక్టివిటీపై దృష్టి పెట్టడంపై చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ ప్రాజెక్ట్…. లోతట్టు ప్రాంతాలను పోర్టుకు అనుసంధానించడం సులభమవుతుందన్నారు. లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడంలో కీలకం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులను త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్రప్రభుత్వం తరపున అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తామని ట్వీట్ చేశారు.
ఈ భారీ రోడ్డుకు నిధులు మంజూరుపై నితిన్ గడ్కరీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారితో కనెక్ట్ చేసేందుకు 6 లైన్ల రోడ్డు నిర్మించడం మంచి పరిణామమన్నారు. మంత్రి నారా లోకేష్ కూడా గడ్కరీకి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. “ఏపీ మౌలిక సదుపాయాలు, ఓడరేవు ఆధారిత వృద్ధికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మచిలీపట్నం పోర్టుకు ఈ 6-లేన్ల బాహ్య కనెక్టివిటీ రహదారి లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడంలో, రాష్ట్రానికి కొత్త ఆర్థిక అవకాశాలను తెరవడంలో మద్దతుగా నిలుస్తుంది" అని ట్వీట్ చేశారు. బీజేపీ ఎంపీ పురందేశ్వరి కూడా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

