ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో పల్లకిపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఈ వాహనసేవ భక్తి భావంతో వైభవంగా జరిగింది. భజన బృందాల హారతులు, కోలాటాల మధ్య స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

'మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో ఎంతో రమణీయంగా వర్ణించారు. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి అమృతం లభించినప్పుడు దానిని పంచుకునే విషయంలో కలహం చెలరేగుతుంది. ఆ కలహాన్ని నివారించి అసురులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని అందించేందుకు శ్రీహరి మోహిని రూపంలో అవతరించారు. తన భక్తులు కానివారు మాయకు లోనవుతారని, భక్తులు మాత్రం ఆ మాయను సులభంగా అధిగమించగలరని ఈ మోహిని రూపం ద్వారా స్వామివారు సూచిస్తున్నారని పురాణాలు తెలియజేస్తున్నాయి.' అని టీటీడీ ప్రకటనలో తెలిపింది.
వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు అత్యంత వైభవంగా గరుడసేవ ఉంటుంది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
హనుమంత వాహన సేవ
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి విశేషమైన హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామలక్ష్మణులు తమ ప్రియ భక్తుడైన హనుమంతుని వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి కేరళం డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ, మంగళ వాయిద్యాల నడుమ వాహనసేవ ఘనంగా కొనసాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన హనుమంతుడు దాసభక్తికి ప్రతీకగా నిలిచారు. రాముడు హనుమంతునికి ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదించే హనుమంతుని సేవాభావాన్ని స్మరించుకుంటూ స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు.
{{/usCountry}}త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన హనుమంతుడు దాసభక్తికి ప్రతీకగా నిలిచారు. రాముడు హనుమంతునికి ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదించే హనుమంతుని సేవాభావాన్ని స్మరించుకుంటూ స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు.
{{/usCountry}}