...
...
Next Story

Srisailam Dam Water Level : శ్రీశైలంలో క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం - తాజా పరిస్థితి ఇలా…

Srisailam Dam Water Level : శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గింది. వివిధ ఎత్తిపోతల పథకాలు, విద్యుదుత్పత్తి కోసం నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి.

Published on: Aug 28, 2026, 10:09:32 IST
Advertisement

Srisailam Dam Water Level : తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం… మరోవైపు విద్యుదుత్పత్తితో పాటు వివిధ సాగునీటి అవసరాల కోసం దిగువకు నిరంతరం నీటిని తోడేస్తుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పడిపోతోంది.

ఇవాళ ఉదయం నమోదైన నీటిమట్టం వివరాలు

శ్రీశైలం జలాశయం (ఫైల్ ఫొటో)
శ్రీశైలం జలాశయం (ఫైల్ ఫొటో)

అధికారుల సమాచారం ప్రకారం ఇవాళ(ఆగస్ట్ 28, 2026) ఉదయం 8:45 గంటల సమయానికి శ్రీశైలం వద్ద నమోదైన ప్రధాన వివరాలు….

  • ప్రస్తుత నీటిమట్టం: 873.701 అడుగులు
  • నీటి నిల్వ: 157.507 టీఎంసీలు
  • ఇన్‌ఫ్లో (వచ్చే నీరు) : 0
  • ఔట్‌ఫ్లో (వెళ్తున్న నీరు): 48,765 క్యూసెక్కులు

జలాశయంలో నీటి నిల్వ తగ్గడానికి ప్రధాన కారణం ఔట్‌ఫ్లో ఎక్కువగా ఉండటమే. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం (SLBHES) ద్వారా తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ నీటిని విడుదల చేస్తోంది. దీనికి తోడు శ్రీశైలం ఆధారిత వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా నిరంతరం నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఒకవైపు ఇన్‌ఫ్లో దాదాపు శూన్యస్థాయికి చేరినా… దిగువకు 48,765 క్యూసెక్కుల చొప్పున నీటిని పంపడం వల్ల జలాశయం ఖాళీ అవుతోంది.

ఎగువన వర్షాలు తగ్గడమే కారణం

కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఎగువ రాష్ట్రాలలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలానికి వచ్చే నీటి శాతం భారీగా పడిపోయింది. గురువారం నాడు కేవలం 3,483 క్యూసెక్కుల స్వల్ప ప్రవాహం మాత్రమే ప్రాజెక్ట్‌కు వచ్చి చేరింది. ఎగువ నుంచి కొత్తగా వరద నీరు వచ్చి చేరితే తప్ప శ్రీశైలంలో నీటిమట్టం తిరిగి పుంజుకునే అవకాశం లేదు.

ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవటంతో కీలకమైన శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండని పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం ఎగువ నుంచి వచ్చిన వరద నీటిపైనే ఆధారపడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను అత్యంత పొదుపుగా వాడుకునే దిశగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణను సిద్ధం కూడా చేశాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe