...
...
Next Story

ఈ జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులు.. సెప్టెంబర్ 18లోపు అప్లై చేయండి

anganwadi jobs : నంద్యాల జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలి.

Published on: Sep 8, 2026, 10:53:35 IST
Advertisement

నంద్యాల జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి, సాధికారత కార్యాలయం(WDCW) పరిధిలో 6 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లలోని అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హతగల అభ్యర్థులు సెప్టెంబర్ 18వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అంగన్వాడీ ఉద్యోగాలు
అంగన్వాడీ ఉద్యోగాలు

మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకు సంబందించి 3 పోస్టులు ఉండగా.. అంగన్వాడీ ఆయాల పోస్టులు 67 ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్త పోస్టునకు కావాల్సిన అర్హతలు చూసుకుంటే.. అభ్యర్థి తప్పని సరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తేదీ 01.07.2026 నాటికి 21 వ సం.ల వయస్సు నిండి 35 సం.ల వయస్సు లోపు వారై ఉండాలి. తప్పనిసరిగా వివాహితురాలై, స్థానిక నివాసితురాలు కావాలి.

ఎస్సీ, ఎస్టీ జనవాస ప్రాంతాలలో అభ్యర్థినిలలో 21 సం. వయసు నిండిన వారు లేకుంటే 18 సంవత్సరాలు నిండిన వారిని పరిగణలోనికి తీసుకుంటారు. అంగన్వాడీ ఆయా పోస్టులకు సైతం ఇవే అర్హతలు ఉండాలి.

అప్లికేషన్ చేసుకునే సమయంలో కొన్ని పత్రాలు జతపరచాలి. పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రం, కుల దృవీకరణ పత్రం, విద్యార్హత దృవీకరణ పత్రం, పదో తరగతి మార్క్ మెమో జిరాక్స్, టీసీ, ఎస్ఎస్‌సీ కంటే ఎక్కువ చదివిన మార్క్ లిస్ట్, టీసీ జతపర్చాలి. నివాస స్థల దృవీకరణ పత్రం, వితంతువు అయితే భర్త మరణ దృవీకరణ పత్రం, 18 సంవత్సరాల పిల్లలు ఉంటే వారి వయసు నిర్ధారించే పత్రం, వికలాంగులు అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉండాలి. ఆధారు కార్డ్, రేషన్ కార్డు కూడా జత చేయాలి. వితంతువులు అయితే సంబంధిత పత్రం ఇవ్వాలి.

ఈ నోటిఫికేషన్‌ను ఏ సమయములోనైనా.. మార్పులు, ఖాళీల సంఖ్యలో మార్పు లేదా రద్దు చేసే అధికారం జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి అధికారి, జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది.

ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక వెబ్‌సైట్ వెళ్లండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe