అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. 'జలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ సర్వస్వం... దానిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పనిచేస్తున్నామని, పరిగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలన్నారు. నీటిని నిల్వ చేసుకుంటే అదే సంపద సృష్టి్స్తుందన్నారు.

ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మసేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లామని చంద్రబాబు అన్నారు. పంటకుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశామని చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్‌లు, నీరు చెట్టు, నీరు మీరు, నీరు ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల లాంటి భాగస్వాములతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు.
'అనంతపురం లాంటి ప్రాంతాల్లో కొన్ని ఏళ్లపాటు నీరే లేదు. నష్ట పోతున్న రైతులను ఆదుకోడానికి ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది కూడా టీడీపీనే. అనంతపురం జిల్లాలో నీటిని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమం తీసుకువచ్చాం. 90 శాతం మేర సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఇచ్చింది కూడా గతంలో మేమే. మైక్రో ఇరిగేషన్ పై గతంలో ఇచ్చిన నివేదికే ప్రామాణికంగా మారి దేశంలో అంతా వినియోగించే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్ లో రూ.1,031 కోట్లు వ్యయం చేస్తూ దేశంలో నెంబర్ వన్ గా ఉన్నాం.' అని చంద్రబాబు అన్నారు.
డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా మారిందని, హార్చికల్చర్‌లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. పూర్వోదయ స్కీమ్ ద్వారా కేంద్రం నుంచి రూ.30 వేల కోట్లు, ప్రైవేటు ద్వారా మరో రూ.70 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. గడచిన 21 నెలల్లో నీటి భద్రతా పరంగా చాలా మార్పులు వచ్చాయని, చెరువులు పెద్ద ఎత్తున నింపగలిగామన్నారు. జల సంరక్షణా చర్యల కారణంగా భూగర్భజలాలను 1.92 మీటర్ల మేర అదనంగా పెంచగలిగామన్నారు.
{{/usCountry}}డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా మారిందని, హార్చికల్చర్‌లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. పూర్వోదయ స్కీమ్ ద్వారా కేంద్రం నుంచి రూ.30 వేల కోట్లు, ప్రైవేటు ద్వారా మరో రూ.70 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. గడచిన 21 నెలల్లో నీటి భద్రతా పరంగా చాలా మార్పులు వచ్చాయని, చెరువులు పెద్ద ఎత్తున నింపగలిగామన్నారు. జల సంరక్షణా చర్యల కారణంగా భూగర్భజలాలను 1.92 మీటర్ల మేర అదనంగా పెంచగలిగామన్నారు.
{{/usCountry}}'గత ఏడాది వేసవి ముందు 8, వేసవి తర్వాత 3 మీటర్లుగా భూగర్భజలాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో గతంలో 13 మీటర్ల మేర ఉంటే ఇప్పుడు 11 మీటర్లకే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. అంటే చేపట్టిన భూసంరక్షణ చర్యల కారణంగా 2.2 మీటర్ల మేర జలాలు పెరగటం సంతోషం కలిగిస్తోంది. అన్నమయ్య జిల్లాల్లో దీనిని ఓ ప్రజాఉద్యమంగా చేపట్టి విజయం సాధించారు. ఈ ఉద్యమంలో ప్రజలందరికీ నేను తోడుగా ఉంటాను. అన్నమయ్య జిల్లాలో 5.7 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వచ్చాయి.' అని ముఖ్యమంత్రి అన్నారు.
20 వేలకు పైగా బోర్లలో నీరు అందుబాటులోకి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఒక్క జిల్లాలో 96 కోట్ల మేర విద్యుత్ ఆదా అయ్యిందన్నారు. భూగర్భజలాలు పెరగటం మూలంగా హరిత ప్రాంతం పెరిగిందని, ఇవన్నీ సానుకూలమైన అంశాలు అన్నారు. వర్షాకాలం కంటే ముందు 6 మీటర్ల లోతున, ఆ తర్వాత 3 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలాలు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు.
ఇలా చేయగలిగితే రాష్ట్రంలో నీటి ఎద్దడి అనేది ఉండదని, రిజర్వాయర్లలో నీళ్లు నిండుగా ఉంటే ఎప్పటికప్పుడు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు చంద్రబాబు. శ్రీశైలం నీటిని వేర్వేరు చోట్ల ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి నీరు తెచ్చుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోనూ, రాయలసీమలోనూ ప్రతీ ఎకరాకూ నీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఖరీఫ్‌కు 547 టీఎంసీలు, రబీకి 343 టీఎంసీలు, పరిశ్రమలకు 28, తాగునీటికి 158 టీఎంసీల నీరు అవసరం అవుతుందన్నారు. మొత్తంగా 1300 టీఎంసీల వరకూ నీటి అవసరం ఉంటుందని చెప్పారు.