సంక్రాంతికి ముందు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు ప్రారంభమవుతున్నాయా? వాతావరణ శాఖ అవుననే చెబుతోంది. ఏపీలో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. తెలంగాణలో వాతావరణ మార్పులు కనిపిస్తాయి. బంగాళాఖాతంలో తుపానుకు అనుకూలమైన పరిస్థితుల కారణంగా దక్షిణాది రాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు భావిస్తున్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది గురువారం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని భావిస్తున్నారు. తుపానుగా మారితే భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వాయుగుండం తీరం వైపు కదులుతుంది, దీని వలన ఏపీ, తమిళనాడులో వర్షాలు కురుస్తాయి. అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున కొన్ని తమిళనాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పుదుచ్చేరి, కారైకల్ వంటి తీరప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
డిసెంబర్ 10-11 తేదీల్లో ఏపీలో మోస్తరు వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పుదుచ్చేరి, కారైకల్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, కడలూరు, విల్లుపురంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు శని, ఆదివారాల్లో కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహమ సంస్థ తెలిపింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు తుపాను హెచ్చరికల కేంద్రం ఒకటో నెంబర్ హెచ్చరికను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి మాత్రం తేలికపాటి ప్రభావమే ఉంటుందని అంచనా. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉండవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఆదిలాబాద్, వరంగల్, ఇతర జిల్లాల్లో చలి, దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయే అవకాశం ఉంది.
{{/usCountry}}మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉండవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఆదిలాబాద్, వరంగల్, ఇతర జిల్లాల్లో చలి, దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయే అవకాశం ఉంది.
{{/usCountry}}హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం లేదా రాత్రి వేళల్లో పొగమంచు పరిస్థితులు ఉంటాయని అంచనా. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల నుంచి కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని ఆ శాఖ ప్రకటించింది.