...
...
Next Story

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో రెండు మూడు రోజులు వర్షాలు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేసింది.

Published on: Oct 13, 2025, 17:18:21 IST
Advertisement

ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లుగా అమరావతి వాతావరణం కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. ఉత్తర తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం నైరుతు బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసింది.

ఏపీ, తెలంగాణ  వర్షాలు
ఏపీ, తెలంగాణ వర్షాలు

ఈ కారణంగా వచ్చే రెండు మూడు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటుగా రాయలసీమ, యానాంలో తేలికపాటి వానలు పడుతాయి. కొన్ని ప్రదేశాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడుతాయి.

సోమ, మంగళ, బుధ వారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

తెలంగాణలో వర్షాలు

తెలంగాణలోనూ మూడో రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు పడనున్నాయి.

సోమవారం కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగాం, సిద్దిపేట, హన్మకొండ, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. మంగళ, బుధ వారాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks