...
...
Next Story

AP TET 2026 Results : ఏపీ టెట్ పరీక్షల అప్డేట్ - కీలు, రిజల్ట్స్ ఎప్పుడు..? ఎక్కడ చెక్ చేసుకోవాలి..?

AP TET 2026 Keys Results : ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ప్రాథమిక కీలు విడుదలవుతాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… వచ్చే నెలలో ఫలితాలను ప్రకటిస్తారు.

Published on: Aug 16, 2026, 10:54:47 IST
Advertisement

AP TET 2026 Keys Results : ఏపీ టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక కీలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం…. అన్ని సబ్జెక్టుల టెట్ పరీక్షలు ఈనెల 16వ తేదీతో పూర్తిగా ముగియనున్నాయి.పరీక్షలు పూర్తయిన వెంటనే ప్రాథమిక ఆన్సర్ కీ నుంచి తుది ఫలితాల ప్రకటన వరకు అన్ని దశలకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రాథమిక కీ లు ఎప్పుడంటే..?

ఏపీ టెట్
ఏపీ టెట్

ఈనెల 16న పరీక్షలు ముగిసిన వెంటనే…. అభ్యర్థులు తమ సమాధానాలను సరి చూసుకునేందుకు వీలుగా ఈనెల 24వ తేదీన ప్రాథమిక (ఇనిషియల్) ఆన్సర్ కీని అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రాథమిక కీ పై ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే, వాటిని దాఖలు చేయడానికి అభ్యర్థులకు తగిన సమయం ఉంటుంది.

ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారానే అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యర్థులు తమ వద్ద ఉన్న సరైన ఆధారాలతో నిర్ణీత సమయంలోగా ఈ అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఫైనల్ కీ, ఫలితాల ప్రకటన ఎప్పుడంటే…?

అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణుల కమిటీ సమగ్రంగా పరిశీలిస్తుంది. అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం సెప్టెంబర్ 8వ తేదీన ఫైనల్ ఆన్సర్ కీని ప్రకటిస్తారు. తుది కీ ఆధారంగా మార్కుల మూల్యాంకనం పూర్తి చేసి… సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు.

భవిష్యత్తులో రాబోయే ఉపాధ్యాయ నియామక పరీక్షలకు (డీఎస్సీ) టెట్ మార్కులకు వెయిటేజీ ఉండటంతో, అభ్యర్థులు ఈ ఆన్సర్ కీల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరీక్షలు రాసిన ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

ఏపీ టెట్ కీలను ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks