పశ్చిమ ఆసియాలో ఎగుమతులపై నెలకొన్న ఉద్రిక్తతలు, మధ్యవర్తుల జోక్యం, ఏకకాలంలో పంట కోత, అస్తవ్యస్త వాతావరణ పరిస్థితులు వంటి ప్రపంచ, స్థానిక కారణాలతో అరటి రైతులు నష్టపోతున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో టన్నుకు రూ. 18,000 నుంచి రూ. 27,000 మధ్య ధరలు పలికినప్పటికీ.. ఎగుమతి డిమాండ్ తగ్గడంతో మార్చి నుంచి ధరలు తీవ్రంగా పడిపోయాయి.

ఒక దశలో, ధరలు టన్నుకు రూ. 6,000-రూ. 9,000 కు పడిపోయాయి. తర్వాత ధరలు సుమారు రూ. 10,000 - రూ. 11,000 వరకు స్వల్పంగా కోలుకున్నప్పటికీ రైతులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. అరటి సాగులో పులివెందుల ప్రాంతం ఎక్కువ వాటాను కలిగి ఉంది. దాదాపు 25,000 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇతర ప్రాంతాలలో 8 నుండి 10 రోజులతో పోలిస్తే.. ఈ ప్రాంతపు అరటిపండ్లు వాటి నాణ్యతకు పెట్టింది పేరు. 12 నుండి 14 రోజుల పాటు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
ఇక్కడ నుంచి సగటున ప్రతిరోజూ 1,000 టన్నులకు పైగా అరటిపండ్లు ఢిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్ వంటి నగరాలకు, అలాగే హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు రవాణా అవుతున్నాయి. అరబ్ దేశాలకు కూడా ఎగుమతులు జరుగుతాయి. ప్రతిరోజూ 10 నుండి 16 ట్రక్కుల లోడ్లు వెళ్తాయి. ప్రతి ట్రక్కు 20 నుండి 25 టన్నుల సరుకును తీసుకువెళుతుంది. ఇది ముంబై ఓడరేవులకు చేరడానికి ముందు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుంది.
ఉత్పత్తి బాగా ఉన్నా.. అధిక రవాణా ఖర్చులు లాభాలను తగ్గిస్తున్నాయి. రైతులు 20 టన్నుల రవాణాకు రూ. 80,000 నుండి రూ. 1.1 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే కిలోకు రూ. 6-8 చొప్పున ఖర్చవుతోంది. దీనితో పోలిస్తే, మహారాష్ట్ర రైతులకు కిలోకు కేవలం రూ. 2-3 మాత్రమే ఖర్చవుతోంది. మహారాష్ట్ర నుండి ముందుగానే అరటి రావడం కడప ఉత్పత్తులకు డిమాండ్‌ను మరింత బలహీనపరిచింది.
{{/usCountry}}ఉత్పత్తి బాగా ఉన్నా.. అధిక రవాణా ఖర్చులు లాభాలను తగ్గిస్తున్నాయి. రైతులు 20 టన్నుల రవాణాకు రూ. 80,000 నుండి రూ. 1.1 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే కిలోకు రూ. 6-8 చొప్పున ఖర్చవుతోంది. దీనితో పోలిస్తే, మహారాష్ట్ర రైతులకు కిలోకు కేవలం రూ. 2-3 మాత్రమే ఖర్చవుతోంది. మహారాష్ట్ర నుండి ముందుగానే అరటి రావడం కడప ఉత్పత్తులకు డిమాండ్‌ను మరింత బలహీనపరిచింది.
{{/usCountry}}కొనుగోలుదారులు లేకపోవడం వల్ల పెద్ద మొత్తంలో పంట అమ్ముడుపోకుండా పొలాల్లోనే కుళ్లిపోతోందని రైతులు అంటున్నారు. ఎకరానికి సాగు ఖర్చులు రూ. 1.5 లక్షలకు చేరుకుంటుండగా, 15-20 టన్నుల దిగుబడిని ఆశిస్తున్న తరుణంలో ప్రస్తుత ధరలతో నష్టాలో ఉన్నాయని రైతులు వాపోతున్నారు.
ఎగుమతులకు అంతరాయం కలగడం, మహారాష్ట్రలో ఉత్పత్తి పెరగడం అనే రెండు కారణాల వల్ల ధరలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. డిమాండ్ పెరగడంతో ధరలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, రైతులు మాత్రం ఇంకా అనుమానంగానే ఉన్నారు. ధరలను తగ్గించడానికి మధ్యవర్తులు అంతర్జాతీయ అంశాలను సాకుగా చూపుతున్నట్టుగా చెబుతున్నారు.