పరాయి వ్యక్తి మోజులో పడి.. కట్టుకున్నవారిని కనికరం లేకుండా చాలామంది చంపేస్తున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగింది. విచారణలో విస్తూపోయే విషయాలు బయటకు వచ్చాయి. ప్రియుడితో కలిసి భార్య ఈ దారుణానికి పాల్పడింది. ఆ తర్వాత గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసింది.

చిలువూరుకు చెందిన శివనాగరాజు(45), లక్ష్మీ మాధురికి 2007లో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు. విజయవాడలోని ఓ సినిమా థియేటర్‌లో మాధురి కొన్ని రోజులు పనిచేసింది. ఇదే సమయంలో ఆమెకు గోపీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
మాధురితో సంబంధం కొనసాగిస్తున్న గోపీ హైదరాబాద్‌లో కారు ట్రావెల్స్ నిర్వహించేవాడు. ప్రియుడితో ఎక్కువ కలిసేందుకు భర్తను అతడి వద్దకే ఉద్యోగానికి పంపింది. కొన్నిరోజులకు వీరిద్దరి విషయం భర్త శివనాగరాజుకు తెలిసింది. దీంతో హైదరాబాద్ నుంచి తన భార్యను తీసుకుని చిలువూరుకు వచ్చేశాడు.
ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా గోపీతో మాధురి వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య చాలాసార్లు గొడవలు అయ్యాయి. నాగరాజుది ఉల్లిపాయాల వ్యాపారం కావడంతో ఎక్కువగా ఇంటి దగ్గరే ఉండేవాడు. దీంతో గోపీతో సంబంధానికి ఇబ్బందిగా ఫీల్ అయింది మాధురి. గొడవలు ఎక్కువ అయ్యాయి.
జనవరి 18వ తేదీన శివనాగరాజు చేసే భోజనంలో అధిక మెుత్తంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. దీంతో గాఢ నిద్రలోకి జారుకున్నాడు భర్త. ఆ తర్వాత ప్రియుడు గోపీని పిలిపించింది. నిద్రపోతున్న నాగరాజు ముఖానికి దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. అనంతరం ప్రియుడు గోపీ వెళ్లిపోయాడు. రాత్రి మెుత్తం మాధురి పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది.
గుండెనొప్పితో తన భార్త చనిపోయాడని చెప్పి ఉదయంపూట మాధురి నాటకం మెుదలుపెట్టింది. కానీ తరచూ గొడవలు జరుగుతుండటంతో ఇరుగు పొరుగు వారికి, మృతుడి తండ్రికి అనుమానాలు వచ్చాయి. శివనాగరాజు ఒంటిపై గాయాలు కూడా కనిపించాయి. దీంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు తండ్రి. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మెుదలుపెట్టారు. విచారణలో ప్రియుడితో కలిసి హత్య చేసినట్టుగా మాధురి వెల్లడించింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
{{/usCountry}}గుండెనొప్పితో తన భార్త చనిపోయాడని చెప్పి ఉదయంపూట మాధురి నాటకం మెుదలుపెట్టింది. కానీ తరచూ గొడవలు జరుగుతుండటంతో ఇరుగు పొరుగు వారికి, మృతుడి తండ్రికి అనుమానాలు వచ్చాయి. శివనాగరాజు ఒంటిపై గాయాలు కూడా కనిపించాయి. దీంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు తండ్రి. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మెుదలుపెట్టారు. విచారణలో ప్రియుడితో కలిసి హత్య చేసినట్టుగా మాధురి వెల్లడించింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
{{/usCountry}}