ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా జరుగుతున్న ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది. ఎన్నికలు మరో రెండు నెలలు ఆలస్యం కానున్నాయని, కోర్టు కేసుల క్లియరెన్స్ వస్తేనే ప్రక్రియ మొదలవుతుందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణపై నెట్టింట రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటర్ల జాబితా (ఎలక్టోరల్ రోల్స్), రిజర్వేషన్లకు సంబంధించి కోర్టులలో నడుస్తున్న కేసుల విచారణ పూర్తయ్యాకే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, అందుకే కనీసం మరో రెండు నెలల సమయం పడుతుందని కొందరు తప్పుడు ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారం ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ పరిస్థితిపై తక్షణమే స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. అసత్య ప్రచారాలను నమ్మవద్దని అధికారికంగా వెల్లడించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం కమిషన్ జారీ చేసినది కాదని, అది కేవలం కల్పితమని ఎస్‌ఈసీ తేల్చిచెప్పింది. ధ్రువీకరించని వార్తలను సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేయడం, ఇతర గ్రూపులకు ఫార్వర్డ్ చేయడం చేయవద్దని ప్రజలతో పాటు రాజకీయ పార్టీలకు, ఇతర భాగస్వామ్య పక్షాలకు విజ్ఞప్తి చేసింది.
అనధికారిక సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్‌ఈసీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ పేరుతో కల్పిత వార్తలు, తప్పుదోవ పట్టించే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక వార్త లేదా నవీకరణ ఉన్నా, దానిని నేరుగా మీడియా సమావేశాల ద్వారా లేదా అధికారిక ప్రెస్ రిలీజ్‌ల ద్వారా మాత్రమే వెల్లడిస్తామని కమిషన్ వెల్లడించింది.
{{/usCountry}}స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక వార్త లేదా నవీకరణ ఉన్నా, దానిని నేరుగా మీడియా సమావేశాల ద్వారా లేదా అధికారిక ప్రెస్ రిలీజ్‌ల ద్వారా మాత్రమే వెల్లడిస్తామని కమిషన్ వెల్లడించింది.
{{/usCountry}}ఏదైనా వార్త లేదా సమాచారం సోషల్ మీడియాలో చూసినప్పుడు, దానిని నమ్మే ముందు ఎస్‌ఈసీ అధికారిక వెబ్‌సైట్, ప్రభుత్వం జారీ చేసే అధికారిక ప్రకటనలను క్షుణ్ణంగా పరిశీలించి ధ్రువీకరించుకోవాలని సూచించింది. ఈ స్పష్టమైన వివరణతో ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యంపై సాగుతున్న పుకార్లకు తెరపడినట్లయింది.