TGSRTC Union Elections 2026 : ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా - షెడ్యూల్‌ విడుదల

TGSRTC Union Elections 2026 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఎనిమిదేళ్లుగా వేచి చూస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 9న పోలింగ్, 17న ఫలితాలు వెలువడనున్నాయి.

Published on: Sep 18, 2026, 18:17:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TGSRTC Union Elections 2026 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎన్నికల శంఖారావం మోగింది. దాదాపు ఎనిమిదేళ్లుగా తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం (యూనియన్) ఎన్నికలకు ఎట్టకేలకు ఆర్టీసీ యాజమాన్యం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు సమగ్రమైన ఎన్నికల షెడ్యూల్‌ను అధికారులు అధికారికంగా విడుదల చేశారు.

ఆర్టీసీలో ఎన్నికలు
ఆర్టీసీలో ఎన్నికలు

ఈనెల 21వ తేదీ నుంచే ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. అక్టోబరు 9న ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. అనంతరం అక్టోబరు 17న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి విజేతలను ప్రకటించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

చివరిసారిగా ఆర్టీసీలో 2016 జులై 19న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం నాలుగేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత 2018లోనే ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ….. అప్పటి ప్రభుత్వం పలు కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. దాంతో ఎనిమిది సంవత్సరాలుగా కార్మికుల తరఫున మాట్లాడే చట్టబద్ధమైన కమిటీ లేకుండాపోయింది. మళ్లీ ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ఇప్పుడు పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.

గుర్తింపు సంఘం అంటే ఏంటి…?

ఆర్టీసీ సంస్థలో ఎన్నో రకాల కార్మిక సంఘాలు, యూనియన్లు ఉన్నప్పటికీ.. ఎన్నికల్లో విజయం సాధించిన సంఘాలనే చట్టబద్ధమైన "గుర్తింపు సంఘం"గా పరిగణిస్తారు. ఈ ఎన్నికలను రీజియన్ స్థాయి మరియు రాష్ట్ర స్థాయిల్లో వేర్వేరుగా జరుపుతారు. రెండు స్థాయిలకు సంబంధించి ఓటర్లకు వేర్వేరు బ్యాలెట్ పత్రాలను అందిస్తారు.

కార్మికుల హక్కుల రక్షణలో గుర్తింపు సంఘానిదే ప్రధాన పాత్ర. ఆర్టీసీ కార్మికుల వేతనాల పెంపు, సీఆర్ తో పాటు జీతాల సవరణ, బోనస్‌లు, కరువు భత్యం (డీఏలు), పెండింగ్ బకాయిలు, సర్వీసు నిబంధనలలో మార్పులు, డిపోల పనివేళలు వంటి అత్యంత కీలకమైన సమస్యలపై నేరుగా ఆర్టీసీ యాజమాన్యంతో మరియు ప్రభుత్వంతో అధికారిక చర్చలు జరిపే ఏకైక చట్టబద్ధమైన హక్కు ఈ యూనియన్‌కే ఉంటుంది. కార్మికుల సంక్షేమానికి సంబంధించి యాజమాన్యంతో చట్టబద్ధ ఒప్పందాలు చేసుకోవడంలోనూ గుర్తింపు సంఘం కీలక పాత్ర పోషిస్తుంది.

ఆర్టీసీలో పని చేసే రీజియన్ స్థాయి అధికారి హోదా మినహా మిగిలిన కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు, కార్మికులందరికీ ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కల్పించారు. సుదీర్ఘ కాలం తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆర్టీసీ డిపోల్లో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. కార్మిక సంఘాలు కూడా తమ ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More