TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం.. రోజుకు ఎంత ఇస్తారు?

TGSRTC Drivers : తెలంగాణ ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్ల నియామకంపై కసరత్తు జరుగుతోంది. పలు డిపోల్లో ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ మెుదలైనట్టుగా తెలుస్తుంది.

Published on: Apr 23, 2026, 15:34:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె కారణంగా ప్రజా రవాణా సేవలు స్తంభించిపోయాయి. రెండో రోజు కూడా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నారు. పోలీస్ బందోబస్తు కూడా పెట్టాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి.

తెలంగాణ ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం
తెలంగాణ ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ప్రజా రవాణా సేవలు స్తంభించిపోవడంతో, ప్రధాన మార్గాల్లో అద్దె బస్సులను నడపడానికి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించేందుకు అధికారులు ఒక ప్రణాళికను అమలులోకి తెచ్చారు. ఇలా చాలా డిపోల్లో తాత్కాలిక డ్రైవర్ల నియమించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్, సమ్మె కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల కష్టాలను తగ్గించడానికి ప్రజా రవాణా సంస్థ అధికారులు వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. చాలా పెళ్లిళ్లు ఏప్రిల్ 26, 29 తేదీలలో జరగనున్నాయి.

టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండు వేతన సవరణ కమిషన్లను (పీఆర్సీలను) అమలు చేయడం వంటివి 32 డిమాండ్లపై కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే ఇందులో 29 డిమాండ్లకు ఓకే అని, మిగిలినవాటి గురించి చర్చిద్దామని ప్రభుత్వం చెప్పుకొస్తుంది.

ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా చూసేందుకు టీజీఎస్ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ సమన్వయంతో తాత్కాలిక డ్రైవర్లను నియమించేందుకు నియామక ప్రక్రియను ప్రారంభించారని టీజీఎస్ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సమ్మె కారణంగా ప్రభావితమైన ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి, బస్సులను నడిపేందుకు రోజువారీ ప్రాతిపదికన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు పలు బస్సు డిపోల అధికారులు చెబుతున్నారు

తాత్కాలిక కండక్టర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు తమ ఒరిజినల్ పదో తరగతి సర్టిఫికేట్లతో పాటు బస్ డిపోలోని అధికారులను సంప్రదించవచ్చు. తాత్కాలిక డ్రైవర్లుగా పనిచేయడానికి ఇష్టపడేవారు తమ ఒరిజినల్ హెవీ వెహికల్ లైసెన్సు(హెచ్ఎంవీ ఒరిజినల్ లైసెన్సు)తో పాటు బస్ డిపోలో రిపోర్ట్ చేయవచ్చు. బస్సు డ్రైవర్‌గా 18 నెలల అనుభవం ఉండాలి. కండక్టర్ పోస్టుకు వచ్చేవారు పదో తరగతి పాస్ అయి ఉండాలి. రోజువారీ (తాత్కాలిక) కండక్టర్లు, డ్రైవర్లకు వరుసగా రోజుకు రూ.800 నుంచి రూ,1000 గౌరవ వేతనం చెల్లిస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More