నేటి జెనరేషన్ గీతాంజలి మూవీ ఇది- కరీంనగర్ కుర్రాడు హిట్ కొట్టాడు: నటుడు జెమిని సురేష్- సూపర్ స్టార్స్ అవుతారన్న దర్శకుడు
కరీంనగరు కుర్రాడు సౌమిత్ పోలాడి హీరోగా శ్రేయాసి సేన్ హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ మ్యూజికల్ లవ్ డ్రామా సినిమా నిలవే. వాలంటైన్స్ డే కానకగా విడుదలైన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సముద్ర, నటుడు జెమిని సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రీసెంట్‌గా టాలీవుడ్‌లో వచ్చిన మ్యూజికల్ పొయెటిక్ రొమాంటక్ లవ్ స్టోరీ సినిమా నిలవే. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రేయాసి సేన్ హీరోయిన్‌గా చేసింది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా కీలక పాత్రలు పోషించారు.

వాలంటైన్స్ డే కానుకగా
పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కె వెన్నం నిర్మించిన నిలవే సినిమా వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల అయింది. థియేట్రికల్ రిలీజ్ నుంచే నిలవే సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌ను తెచ్చుకుంటోంది.
రామానాయుడు స్టూడియోలో సెలబ్రేషన్స్
బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా అందరి ఆదరణ అందుకుంటున్న నేపథ్యంలో మగంళవారం (ఫిబ్రవరి 17) నాడు రామానాయుడు స్టూడియోలో నిలవే సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, గీత రచయిత చంద్రబోస్ వీడియో బైట్ ద్వారా స్పందిస్తూ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచిందని చెబుతూ టీమ్‌ను అభినందించారు.
డైరెక్టర్ సముద్ర కామెంట్స్
అలాగే, నిలవే మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డైరెక్టర్ సముద్ర హాజరు అయ్యారు. ఆయనతోపాటు నటుడు జెమినీ సురేశ్, నిర్మాత రాజ్ అల్లాడ భార్య మాధురి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో నిలవే సినిమా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సూపర్ స్టార్స్ అవుతారు
దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ వాలెంటైన్స్ డేకి విడుదలైన ఆరేడు చిత్రాల్లో ‘నిలవే’ సక్సెస్‌ఫుల్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు. డైరెక్టర్ సాయి కే వెన్నం గారెతో పాటు టీమ్ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నా” అని అన్నారు.
గీతాంజలిలా నిలవే నిలుస్తుంది
నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూశాననే ఫీలింగ్ మనసుకు కలిగింది. బాపు గారు గీసిన బొమ్మలా, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలా, నేటి జనరేషన్ ‘గీతాంజలి’లా ‘నిలవే’ చిత్రం నిలుస్తుంది” అని ఆశించారు.
కరీంగనర్ కుర్రాడికి హిట్
‘‘ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన రాజ్ అల్లాడ గారికి థ్యాంక్స్. డైరెక్టర్ సాయి విజన్, దిలీప్ విజువల్స్, కల్యాణ్ మ్యూజిక్ అద్భుతంగా కుదిరాయి. మా కరీంనగర్ కుర్రాడు సౌమిత్ ఈ సినిమాతో హిట్ కొట్టాడు” అని జెమిని సురేష్ పేర్కొన్నారు.
మనసుకు హత్తుకునేలా
నిర్మాత రాజ్ అల్లాడ భార్య మాధూరి మాట్లాడుతూ..‘‘మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వారంతా కొత్త వాళ్లు తీసినట్టు లేదని చెబుతున్నారు. ముఖ్యంగా మ్యూజిక్ మా మూవీకి మరింత ప్లస్ అయ్యింది. అందరి మనసుకు హత్తుకునేలా మా చిత్రం ఉంటుంది” అని చెప్పారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


