Hyderabad Metro RTC Joint Pass : నగరవాసులకు గుడ్ న్యూస్.... మెట్రో- ఆర్టీసీ జాయింట్ పాస్ పై కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా వెంటనే జాయింట్ పాస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. పాతబస్తీ మెట్రో పనులనూ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

Published on: Sep 7, 2026, 09:11:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరవాసులకు ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి వీలుగా ఒకే 'జాయింట్ పాస్' విధానాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

మెట్రోలో సీఎస్ ప్రయాణం
మెట్రోలో సీఎస్ ప్రయాణం

నగర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సౌకర్యవంతంగా రోజువారీ , నెలవారీ (Monthly) పాస్‌లు జారీ చేయడానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని మెట్రో, టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

బేగంపేటలోని మెట్రో రైల్ భవన్‌లో హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ (HMRL), టీజీఎస్‌ఆర్టీసీ, విద్యుత్ శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ విభాగాల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటి, రెండో విడత హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుల్లో భాగంగా ఇప్పటివరకు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండి బి. అజిత్ రెడ్డి, జాయింట్ ఎండి శివేంద్ర ప్రతాప్‌లు సీఎస్‌కు వివరంగా వివరించారు.

పాతబస్తీ మెట్రో పనులపై సమీక్ష…

పాతబస్తీ మెట్రో కారిడార్ రోడ్డు వెడల్పు పనుల ప్రస్తుత పురోగతిపై సీఎస్ సంజయ్ జాజు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జనరల్ కన్సల్టెంట్‌ను నియమించేందుకు జరుగుతున్న టెండర్ల ప్రక్రియ ఏ దశలో ఉందో అధికారులు సీఎస్‌కు నివేదించారు. దాదాపు 7.5 కిలోమీటర్ల మేర ఉన్న పాతబస్తీ మెట్రో విస్తరణ పనులను పరుగులు పెట్టించాలని, ప్రాజెక్టు క్షేత్రస్థాయి పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సీఎస్ ఆదేశించారు.

మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు ఉమ్మడి పాస్ ఇచ్చేందుకు సాంకేతికంగా తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్, టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు సీఎస్‌కు తెలియజేశారు. ఎప్పుడైనా దీనిని అమలు చేయడానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ఉమ్మడి ఛార్జీల విధానాన్ని వీలైనంత త్వరగా ఆమోదించి, పాస్ వ్యవస్థను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని సీఎస్ స్పష్టం చేశారు.

మెట్రోలో ప్రయాణించిన ప్రధాన కార్యదర్శి…

సమీక్షా సమావేశం అనంతరం సీఎస్ సంజయ్ జాజు బేగంపేట నుంచి ప్యారడైజ్ వరకు మెట్రో రైలులో స్వయంగా ప్రయాణించారు. ఆయనతో పాటు హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండి బి. అజిత్ రెడ్డి కూడా ప్రయాణించారు. స్టేషన్లలోని వాణిజ్య సముదాయాలు, పార్కింగ్ స్థలాలను స్వయంగా పరిశీలించారు. టి అభివృద్ధికి సంబంధించి పలు విలువైన సూచనలు చేశారు. అనంతరం ఎన్‌హెచ్-44పై హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను కూడా సీఎస్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More