Hyderabad : నగర వాసులకు శుభవార్త - అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్..! ఇక ఆగకుండా సాఫీగా జర్నీ
Shastripuram ROB Flyover in Hyderabad : ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా పాతబస్తీ ఏరియాలోని శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.
Shastripuram ROB Flyover in Hyderabad : హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పాతబస్తీ ఏరియాలో తలపెట్టిన శాస్త్రీపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది.

సికింద్రాబాద్ - ఫలక్‌నుమా - శివరాంపల్లి రైల్వే లైన్‌పై ఎల్‌సీ నంబర్ 7 వద్ద నిర్మించిన ఈ గ్రేడ్ సెపరేటర్ (ఆర్‌ఓబీ)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభిస్తారు. మైలార్‌దేవ్‌పల్లి, ఫలక్‌నుమా ఆర్‌టీసీ బస్ డిపో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.
ప్రాజెక్ట్ విశేషాలు :
- మొత్తం రూ.71.0 కోట్ల వ్యయంతో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది.
- ఈ వంతెన మొత్తం పొడవు 490 మీటర్లు కాగా, అందులో రైల్వే ట్రాక్‌ల పైనుంచి వెళ్లే భాగం (Railway Portion) 37.28 మీటర్లుగా ఉంది.
- వాహనాల రాకపోకలకు వీలుగా దీని వెడల్పును 16.60 మీటర్లుగా నిర్ణయించారు.
- ఇది 4-లేన్ల క్యారేజ్ వే (ఇరువైపులా రెండు వరుసలు) కలిగి ఉండటంతో వాహనదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు.
- ఓపెన్ ఫౌండేషన్లపై సింగిల్ పియర్స్, ఆర్‌సీసీ ప్రీకాస్ట్ పియర్ క్యాప్స్‌తో పటిష్టంగా నిర్మించారు.
- రైల్వే భాగంలో స్టీల్ గర్డర్లను ఉపయోగించారు. వంతెన స్థిరత్వం కోసం అత్యాధునిక 'పాట్-పీటీఎఫ్‌ఈ' (POT-PTFE) బేరింగ్లను అమర్చారు.
- రీన్‌ఫోర్స్డ్ ఎర్త్ రిటైనింగ్ వాల్స్ (RE Walls), జియో స్ట్రిప్స్ సాంకేతికతతో ఇరువైపులా గోడలను నిర్మించారు. భద్రత కోసం ప్రీకాస్ట్ ఫ్రిక్షన్ స్లాబ్, క్రాష్ బారియర్లను ఏర్పాటు చేశారు.
ప్రయాణికులకు ఊరట…
ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల ప్రజలకు ఊరట లభించనుంది. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద గతంలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ ఆర్‌ఓబీ వల్ల ప్రయాణ సమయం కనీసం 30 నిమిషాలు ఆదా అవుతుంది.
మైలార్‌దేవ్‌పల్లి, వట్టేపల్లి, ఫలక్‌నుమా ఆర్‌టీసీ డిపోల మధ్య రాకపోకలు సాఫీగా సాగుతాయి. ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి. వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. మెరుగైన రవాణా సౌకర్యాల వల్ల ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. "ఈ ప్రాజెక్టు పూర్తవ్వడం వల్ల పాతబస్తీ రవాణా ముఖచిత్రమే మారిపోతుంది" అని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.ఈ ప్రాజెక్ట్ పూర్తికావడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

