ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. పర్యావరణపరంగానూ, ఆధ్యాత్మికంగానూ, ఆర్థికంగానూ దీనికి ఉన్న ప్రాధాన్యం అపారమైందన్నారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయపడ్డారుయ
ఒక్క దుంగ కూడా వెళ్లొద్దు - డిప్యూటీ సీఎం

ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా అక్రమంగా బయటకు వెళ్లకూడదనీ… దీని కోసం ఓ పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని తాజాగా అధికారులను ఆదేశించారు. వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేస్తే అక్రమార్కుల ఆటకట్టించడం అసాధ్యం కాదన్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొన్న కింగ్ పిన్స్ ను చట్టం ముందు నిలపడానికి ప్రత్యేక బృందాలను పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెట్లను నరకడానికి వస్తున్న కూలీలు, మేస్త్రీలు, సూపర్ వైజర్లు, గోదాము కీపర్లు వంటి కిందిస్థాయి వారిని గుర్తించి… వారికి చట్టంపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. వారికి ఇతర ఉపాధి మార్గాలు చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
శనివారం అటవీశాఖ ఉన్నతాధికారులతో ఎర్ర చందనం పరిరక్షణ, అక్రమ రవాణా నిరోధానికి ఉన్న మార్గాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ‘‘2015లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చొరవ తీసుకుంది. అప్పట్లోనే దీని కోసం ప్రత్యేకంగా ఆలోచించి రెడ్ సాందర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేశారు. కార్యకలాపాలను విస్తృతం చేశారు. ఐజీ స్థాయి అధికారిని టాస్క్ ఫోర్స్ కు నియమించి, అటవీ-పోలీసు అధికారులతో ప్రత్యేకంగా దళం ఏర్పాటు చేయించి ముందుకు వెళ్లారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత టాస్క్ ఫోర్సును ఓ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేశారు" అని చెప్పుకొచ్చారు.
“2019-24 మధ్య లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించారు. నేను ఇటీవల సందర్శించిన తిరుపతిలోని 8 గోదాముల్లో 2,63,267 ఎర్రచందనం దుంగులున్నాయి. కేవలం పట్టుబడిన దుంగలను బట్టి చూస్తేనే సుమారు 2 లక్షల చెట్లు నరికినట్లు అర్ధమవుతోంది. మరి అక్రమ మార్గాల్లో ఎన్ని లక్షల చెట్లను నరికివేశారో ఊహకు అందటం లేదు” అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.
సంకల్పంలా తీసుకోవాలి - పవన్ దిశానిర్దేశం
{{/usCountry}}“2019-24 మధ్య లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించారు. నేను ఇటీవల సందర్శించిన తిరుపతిలోని 8 గోదాముల్లో 2,63,267 ఎర్రచందనం దుంగులున్నాయి. కేవలం పట్టుబడిన దుంగలను బట్టి చూస్తేనే సుమారు 2 లక్షల చెట్లు నరికినట్లు అర్ధమవుతోంది. మరి అక్రమ మార్గాల్లో ఎన్ని లక్షల చెట్లను నరికివేశారో ఊహకు అందటం లేదు” అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.
సంకల్పంలా తీసుకోవాలి - పవన్ దిశానిర్దేశం
{{/usCountry}}“ఎర్రచందనం అనేది పర్యావరణహితమైన చెట్టు. అత్యంత పటిష్టంగా శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే అరుదైన వృక్షం. ఇక నుంచి ఎర్రచందనం ఒక్క దుంగ కూడా బయటకుపోకుండా చేయాలి. దీనికి మన ముందున్న దారులన్నీ వినియోగించుకుందాం. మళ్లీ టాస్క్ ఫోర్సుకు జీవం పోసి, అక్రమ రవాణా నిరోధించే ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతాను. స్మగ్లర్లపై పెట్టిన కేసుల్లోనూ న్యాయస్థానాల నుంచి వేగంగా తీర్పులు రావడం శుభసూచకం. అటవీ శాఖ సిబ్బంది ఎర్ర చందనం సంరక్షణను ఒక సంకల్పంలా తీసుకోవాలి” అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మన రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా అయిన ఎర్రచందనం దుంగలు దేశంలో ఎక్కడ దొరికినా మనకు చెందేలా ప్రత్యేకంగా ఆదేశాలను ఇప్పించామని పవన్ గుర్తు చేశారు. దీంతోనే ఇటీవల గుజరాత్ లో 5 టన్నులు, తమిళనాడు, రాజస్థాన్ ప్రాంతాల్లో 7 టన్నులు, కర్ణాటకలో 6 టన్నులు, ఢిల్లీలో 10 టన్నులు సీజ్ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నేపాల్ లో ఉన్న 173 టన్నల ఎర్రచందనం తిరిగి రాష్ట్రానికి రప్పించే ప్రక్రియ మొదలైందని వివరించారు. దీంతోపాటు వివిధ రాష్ట్రాల్లో 2019-24 ప్రాంతాల్లో పట్టుబడిన 407 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం కూడా తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
“ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అందుబాటులో ఉన్న సాంకేతిక వినియోగానికి తోడు సిబ్బంది కృషి చాలా అవసరం. టెక్నాలజీతోపాటు సంకల్పం తోడైతేనే ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించగలం. పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో నిరంతరం ఎర్రచందనం స్మగ్లింగు జరిగే అవకాశం ఉన్న ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ డ్రోన్లతో నిఘాను పెంచాలి. అటవీ చెక్ పోస్టులను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలను అమర్చి, నిత్యం పర్యవేక్షణ చేయాలి. సరికొత్త బ్యారికేడ్లను చెక్ పోస్టుల వద్ద అమర్చి, బేస్ క్యాంపులు, వాచ్ టవర్లలో గస్తీ ముమ్మరం చేయాలి” అని డిప్యూటీ సీఎం పవన్ సూచనలు చేశారు.