Visakhapatnam Crime News : ట్రైనింగ్‌కు వెళ్తున్నానని చెప్పి.... వంతెన వద్ద శవమై తేలిన విద్యార్థిని

అల్లూరి సీతారామరాజు జిల్లా జకరవలస వంతెన సమీపంలో ఐటీఐ విద్యార్థిని మీనాక్షి మృతదేహం లభ్యమైంది. విశాఖపట్నం ట్రైనింగ్‌కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన మరుసటి రోజే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

Published on: Nov 18, 2026, 17:00:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక ఐటీఐ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని జకరవలస ప్రాంతంలో ఉన్న ఒక వంతెన సమీపంలో యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి బుధవారం వెల్లడించారు. మృతురాలిని ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో మొదటి సంవత్సరం ఐటీఐ చదువుతున్న మీనాక్షిగా గుర్తించారు. చదువు నిమిత్తం ఆమె స్థానికంగా ఒక అద్దె గదిలో నివసిస్తోంది.

ఐటీఐ విద్యార్థిని మృతి (Representative Image )
ఐటీఐ విద్యార్థిని మృతి (Representative Image )

"అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక వంతెన సమీపంలో యువతి మృతదేహాన్ని గుర్తించాము. ఆమె మృతి వెనుక ఉన్న పరిస్థితులను ఇంకా నిర్ధారించలేదు, ఇప్పటివరకు ఎవరినీ అనుమానితులుగా గుర్తించలేదు," అని పోలీసు అధికారి పీటీఐ వార్తా సంస్థకు వివరించారు.

ట్రైనింగ్ పేరుతో ఫోన్.. గదికి తాళం

మంగళవారం సాయంత్రం మీనాక్షి తన అమ్మమ్మకు ఫోన్ చేసి మాట్లాడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మూడు రోజుల శిక్షణ (ట్రైనింగ్) కోసం తాను విశాఖపట్నం వెళ్లాల్సి ఉందని ఆమె అమ్మమ్మకు చెప్పింది. తాను ఊరికి వెళ్తున్నందున….. అద్దె గదిలో ఉన్న తన సామాన్లను వచ్చి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులను కోరింది.

ఆమె మాటలను నమ్మిన మీనాక్షి అమ్మమ్మ, తల్లి, పిన్ని బుధవారం ఒక ఆటోలో ఆమె ఉంటున్న అద్దె గది వద్దకు చేరుకున్నారు. అయితే…. అప్పటికే ఆమె మొబైల్ ఫోన్ అందుబాటులో లేకుండా పోవడంతో పాటు గదికి బయట తాళం వేసి ఉంది. మీనాక్షి అప్పటికే విశాఖపట్నం బయలుదేరి వెళ్లిపోయి ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు, గది తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఆమె వస్తువులన్నింటినీ సర్ది ఆటోలో ఎక్కించుకున్నారు.

కుటుంబ సభ్యులు ఇంకా అదే ప్రాంతంలో ఉండగానే…. సమీపంలోని వంతెన వద్ద మీనాక్షి పోలికలతో ఉన్న ఒక యువతి మృతదేహం పడి ఉందన్న సమాచారం వారికి అందింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వారంతా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ విగతజీవిగా పడి ఉన్నది తమ కూతురు మీనాక్షేనని గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు.

మీనాక్షి మృతికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత రావాల్సి ఉందని, అనుమానితులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More