AP SSC Exams Fee : పదో తరగతి పరీక్షల ఫీజు రివైజ్డ్ షెడ్యూల్ విడుదల

AP SSC Exams Fee : పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించేందుకు విడుదల చేసిన షెడ్యూల్‌ను సవరించారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 5 వరకు ఫైన్ లేకుండా ఎగ్జామ్ ఫీజు చెల్లించవచ్చు.

Published on: Nov 26, 2026, 07:58:08 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ మార్చి 2027లో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థుల కోసం పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. డైరెక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు నవంబర్ 26 నుండి డిసెంబర్ 5, 2026 వరకు ఆలస్య రుసుము లేకుండా తమ పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఈ గడువును కోల్పోయిన వారు డిసెంబర్ 6 నుండి 9 వరకు రూ.50, డిసెంబర్ 10 నుండి 13 వరకు రూ.200, డిసెంబర్ 14 నుండి 18 వరకు రూ.500 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు.

ఏపీ పదోతరగతి పరీక్షల ఫీజు
ఏపీ పదోతరగతి పరీక్షల ఫీజు

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను ముందుగా వారి వారి UDISE+ పాఠశాల లాగిన్‌ల ద్వారా అప్‌డేట్ చేసి, ధృవీకరించుకోవాలని డైరెక్టరేట్ ప్రధానోపాధ్యాయులకు సూచించింది. ధృవీకరణ తర్వాత అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.inలోని పాఠశాల లాగిన్ ద్వారా పరీక్ష ఫీజును చెల్లించాలి.

అన్ని సబ్జెక్టులు లేదా మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరయ్యే రెగ్యులర్ అభ్యర్థులకు పరీక్ష ఫీజును రూ.125గా నిర్ణయించారు. మూడు సబ్జెక్టుల వరకు హాజరయ్యే అభ్యర్థులు రూ.110 చెల్లించాలి. వొకేషనల్ అభ్యర్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. కాగా నిర్ణీత వయసు నిబంధనలకు మినహాయింపు కోరే విద్యార్థులకు వయోపరిమితి సడలింపు రుసుముగా రూ.300 చెల్లించాలి.

అధికారిక వెబ్‌సైట్‌లోని స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లింపులు స్వీకరిస్తామని డైరెక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. CFMS లేదా బ్యాంక్ చలాన్‌ల ద్వారా చేసే చెల్లింపులు అంగీకరించరని చెప్పారు. నిర్దేశించిన గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేశారు. ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి తేదీ వరకు వేచి ఉండవద్దని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అలాగే ఏ స్థాయిలోనూ మాన్యువల్ నామినల్ రోల్స్ (MNRs) సమర్పించాల్సిన అవసరం లేదని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.