NTA CMAT Registration : సీమ్యాట్ - 2027 దరఖాస్తులు ప్రారంభం... పరీక్ష ఎప్పుడంటే..?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీమ్యాట్ - 2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ అయింది. అభ్యర్థులు డిసెంబర్ 20, 2026 లోపు cmat.nta.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Nov 25, 2026, 08:37:52 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT 2027) రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రారంభించింది. 2027-28 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో కోర్సులు చదవాలనుకునే విద్యార్థులకు ఇదోక మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్టీఏ సీమ్యాట్ అధికారిక వెబ్‌సైట్ cmat.nta.nic.in లోని డైరెక్ట్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సీమ్యాట్ - 2027 దరఖాస్తులు ప్రారంభం (Istock Image)
సీమ్యాట్ - 2027 దరఖాస్తులు ప్రారంభం (Istock Image)

ముఖ్యమైన తేదీలు….

సీమ్యాట్ 2027 దరఖాస్తుల స్వీకరణతో పాటు పరీక్ష, అడ్మిట్ కార్డులకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్టీఏ ప్రకటించింది. అభ్యర్థులు డిసెంబర్ 20, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము చెల్లించడానికి డిసెంబర్ 21, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. అప్లికేషన్‌లో పొరపాట్లు సరిదిద్దుకునేందుకు డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 28, 2026 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. పరీక్ష నగర సమాచారం తెలిపే సిటీ స్లిప్‌ను జనవరి 21, 2027న విడుదల చేస్తారు. ఫిబ్రవరి 4, 2027న అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష విధానం, మార్కుల కేటాయింపు

సీమ్యాట్ - 2027 పరీక్షను ఫిబ్రవరి 11, 2027న నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో మూడు గంటల పాటు ఈ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాల్లో అభ్యర్థుల సామర్థ్యాన్ని ఈ పరీక్ష ద్వారా అంచనా వేస్తారు.

ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 400 మార్కులు కేటాయించారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు చొప్పున సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. సమాధానం రాయకుండా వదిలేసిన ప్రశ్నలకు ఎలాంటి మార్కులు ఇవ్వరు.

అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 2027-28 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యేలోపు డిగ్రీ ఫలితాలు వెలువడే బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా సీమ్యాట్ 2027కు దరఖాస్తు చేసుకోవచ్చు.

జనరల్ కేటగిరీ పురుష అభ్యర్థులు రూ. 2500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు రూ. 1250 రుసుము నిర్ణయించారు. జనరల్-ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, పీడబ్ల్యూబీడీ, ఓబీసీ-(ఎన్‌సీఎల్) పురుష అభ్యర్థులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ. 1250 చెల్లించాలి. ఫీజును ఆన్‌లైన్ పద్ధతిలోనే చెల్లించాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం

  • ముందుగా ఎన్టీఏ సీమ్యాట్ అధికారిక వెబ్‌సైట్ https://cmat.nta.nic.in/ లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో కనిపించే సీమ్యాట్ 2027 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీలో అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
  • నిర్దేశించిన దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  • సబ్మిట్ బటన్ నొక్కి కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీ ప్రింట్ కాపీని భద్రపరుచుకోవాలి.
  • మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సీమ్యాట్ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.