హిందూపురంలో వైసీపీ ఆఫీసుపై దాడి - తీవ్రంగా ఖండించిన వైఎస్‌ జగన్‌

హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఆఫీసులోని అద్దాలతో పాటు సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందిస్తూ…. టీడీపీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచరులే ధ్వంసం చేశారని ఆరోపించారు.

Published on: Nov 16, 2025, 07:47:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి జరగటాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి.

వైసీపీ ఆఫీస్ పై దాడి
వైసీపీ ఆఫీస్ పై దాడి

ఖండించిన వైఎస్ జగన్…

హిందూపురంలో వైసీపీ ఆఫీసు మీద జరిగిన దాడిని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు, బాలకృష్ణ అభిమానులు దాడి చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. ఆఫీసులపై దాడులు చేయటం, ఫర్నీచర్ ధ్వంసం చేయడం, అద్దాలు పగలగొట్టడం, కార్యకర్తలపై భౌతిక దాడులను రాజకీయ పార్టీలు మొదలుపెడితే అది ప్రజాస్వామ్య పతనానికి నిదర్శనమన్నారు.

పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.చంద్రబాబు నాయకత్వ మద్దతుతో టీడీపీ నేతలు, రౌడీ మూకలు హింసాత్మక చర్యల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టి, రాజకీయ వ్యతిరేకతను అణచి వేయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపై ఈ దాడి జరిగినట్లే’ అని వైఎస్ జగన్ తన పోస్టులో రాసుకొచ్చారు.

ప్రశ్నిస్తే ఇలా చేస్తారా..? - వైసీపీ సమన్వయకర్త దీపిక

హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపిక మాట్లాడుతూ…. “శనివారం మధ్యాహ్నం టీడీపీ గూండాలు మా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. మా కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే కాదు అందులో ఉన్న దేవుడి విగ్రహాన్ని, భక్త కనకదాస ఫోటోలు కూడా ధ్వంసం చేశారు. దేవుడనే భయం కూడా లేదు. మా పార్టీ బూత్ కమిటీ లీడర్‌ లోకేష్‌ షర్ట్ చించేశారు, పైగా అతన్ని చంపుతామని బెదిరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఉన్నప్పుడే ఇదంతా చేశారు. బాలకృష్ణ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇలా చేస్తారా…? మీ గూండాయిజంకు, రౌడీ ఇజం కు ఎవరూ భయపడరు. మేం ప్రజా సమస్యలపై నిలదీస్తే మీరు తట్టుకోలేరా. మీ దాడులకు భయపడం, బెదరం, ఇంకా పోరాడతాం” అని స్పష్టం చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ… ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మా పార్టీ ఆఫీస్ పై టీడీపీ వాళ్లు దాడి చేసి.. అద్దాలు, ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారని ఆరోపించారు. అడ్డొచ్చిన పార్టీ కార్యకర్తలను కొట్టారని చెప్పారు. టీడీపీ వాళ్లు ఎందుకు ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కనీసం పోలీసులు పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More