స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేసిందని వైఎస్సార్‌సీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పక్కా ప్రణాళికాబద్ధమైన దాడులు, అక్రమాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా కుప్పకూల్చిందని మండిపడింది. ఇదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించింది. షర్మిల కుమార్తె వివాహ వేదిక విషయంలో కూడా జగన్ ను టార్గెట్ చేస్తూ… లేనిపోని ఆరోపణలు చేయటాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా జగన్ రాసిన ఓ లేఖను పార్టీ విడుదల చేసింది.
లేఖలో కీలక విషయాలు…

ఇదే సమయంలో వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 9వ తేదీన రాసిన లేఖను పార్టీ తాజాగా విడుదల చేసింది. షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖలో అనేక కీలక, భావోద్వేగ విషయాలను ప్రస్తావించారు. అంజలి వివాహం నిశ్చయమైన వార్త తెలిసి తాను ఎంతో సంతోషించానని లేఖలో పేర్కొన్నారు.
"గత ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని రాజకీయ, వ్యక్తిగత పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, అంజలి జీవితాంతం ఎంతో సంతోషంగా, ప్రేమానురాగాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని జగన్ ఆకాంక్షించారు.
అయితే బెంగళూరులోని తన నివాస ప్రాంగణంలోనే వివాహ వేడుక నిర్వహించాలనే నిర్ణయంపై తనకున్న భద్రతాపరమైన అభ్యంతరాలను లేఖ ద్వారా వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
"వివాహం వంటి శుభకార్యానికి పెద్ద సంఖ్యలో బంధువులు, అతిథులతో పాటు క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పెద్ద ఎత్తున వస్తారు. వీరిలో చాలామంది తమకు ముందస్తు పరిచయం లేని వ్యక్తులే ఉంటారు. అంతమంది వ్యక్తులు నివాస ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. నివాస ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లడం భద్రతకు ఏమాత్రం మంచిది కాదు" ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు.
"నా పిల్లల (హర్ష లేదా వర్ష) పెళ్లి అయినా కూడా భద్రత, గోప్యత ప్రయోజనాల దృష్ట్యా నేను ఇదే నిర్ణయం తీసుకునేవాడిని. నా సొంత ఇల్లు కాబట్టి ఇక్కడ నేను, నా కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది," అని లేఖలో వివరించారు.
{{/usCountry}}"నా పిల్లల (హర్ష లేదా వర్ష) పెళ్లి అయినా కూడా భద్రత, గోప్యత ప్రయోజనాల దృష్ట్యా నేను ఇదే నిర్ణయం తీసుకునేవాడిని. నా సొంత ఇల్లు కాబట్టి ఇక్కడ నేను, నా కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది," అని లేఖలో వివరించారు.
{{/usCountry}}తన అభ్యంతరాలను, ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని వివాహ వేదికను మార్చాలని వైఎస్ జగన్ కోరారు. గతంలో రాజా పెళ్లి నిర్వహించిన విధంగా ఏదైనా కన్వెన్షన్ సెంటర్‌లో గానీ లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలో గానీ వివాహం జరపవచ్చని సూచించారు. అటువంటి వేదికలు ఇష్టం లేకపోతే హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ ఇంటిని వివాహానికి ఉపయోగించుకోవచ్చని ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన ఇప్పటికీ అలాగే అమల్లో ఉంటుందని చెప్పారు.
"అంజలి వివాహం ఆమె జీవితంలో ఒక ప్రత్యేకానుభూతిగా నిలిచిపోవాలి. భవిష్యత్తులో ఆ రోజును ఆమె ఎంతో ఆనందంగా గుర్తుచేసుకోవాలని ఆశిస్తున్నాను. అందుకోసం సహేతుకంగా నేను చేయగలిగిన ప్రతి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ జగన్ ముగించారు.