...
...
Next Story

మెగాస్టార్ మీద బాలయ్య కామెంట్స్.. రెస్పాండ్ అయిన వైఎస్ జగన్!

ఏపీలో గూగుల్ డేటా సెంటర్ కు బీజం వేసిందని వైసీపీ ప్రభత్వమేనని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. చిరంజీవి మీద నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కూడా తాజాగా స్పందించారు.

Published on: Oct 23, 2025 09:20 PM IST
Advertisement

చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు జగన్. ఈ సందర్భంగా గూగుల్ డేటా సెంటర్ గురించి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే డేటా సెంటర్ కు బీజం పడిందన్నారు. 2023 మే 3న డేటా సెంటర్ శంకుస్థాపన కూడా చేశామని తెలిపారు. సింగపూర్ నుంచి సబ్ సీ కేబుల్ తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందన్నారు. దీనికి కొనసాగింపుగా గూగుల్ డేటా సెంటర్ వచ్చిందన్నారు. వైసీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుల్ డేటా సెంటర్ అన్నారు. వేరే వాళ్లకు క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదని, అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారని పేర్కొన్నారు.

వైఎస్ జగన్
వైఎస్ జగన్

‘హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు సంబంధం లేదు. కానీ చంద్రబాబు మాత్రం తానే కట్టినట్టుగా బిల్డప్ ఇస్తారు ఆరు ఎకరాల్లో హైటెక్ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్. కానీ చంద్రబాబు తానే ముత్తం అభివృద్ధి చేసినట్టుగా చెబుతారు.’ అని జగన్ విమర్శించారు.

మద్యం అమ్మేటప్పుడు బాటిళ్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని చంద్రబాబు చెప్పిన విషయంపై జగన్ మాట్లాడారు. దుకాణాలు ఎవరి చేతుల్లో ఉన్నాయని ప్రశ్నించారు. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. స్కాన్ చేసేది ఎవరు అంటూ ప్రశ్నించారు.

ఉద్యోగులకు జీపీఎస్ లేదని, ఓపీఎస్ లేదని జగన్ అన్నారు. ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను మోసం చేసిన చంద్రబాబు వికృత ఆనందం పొందుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులనే కాదు.. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు.

ఇటీవల అసెంబ్లీలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. చిరంజీవి మీద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా వైఎస్ జగన్ స్పందించారు. ‘బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చి అసందర్భంగా మాట్లాడారు. బాలకృష్ణ మానసిక స్థితి ఎలా ఉందో ఆయనే ఆలోచించుకోవాలి. తాగిన వాళ్లను ఎలా అసెంబ్లీలోకి అనుమతిస్తారు, ఎలా మాట్లాడనిస్తారు.’ అని జగన్ ప్రశ్నించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe