తిరుపతి జిల్లా పరిధిలో కొత్తగా నిర్మించిన రహదారిని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రాక్టర్‌తో తవ్వి ధ్వంసం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని స్పష్టం చేసిన ఆయన, బాధ్యులైన వారిపై నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కఠిన కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

తిరుపతి జిల్లా పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం గ్రామం నుంచి పాపక్కగారిపల్లె వరకు వెళ్లే బీటీ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ. 4.75 కోట్ల వ్యయంతో పునర్నిర్మించింది.
అయితే రోడ్డు నిర్మాణం పూర్తయిన వారం రోజులకే.. వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలు కలిసి ట్రాక్టర్ ఉపయోగించి సుమారు 100 మీటర్ల మేర బీటీ రోడ్డును పూర్తిగా దున్నేసి ధ్వంసం చేశారు. ఈ విధ్వంసాన్ని గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్న పవన్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డి, అతనికి సహకరించిన వారిపై చట్టప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పవన్ ఆదేశించారు. ధ్వంసమైన రహదారి పునర్నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును నిందితుల నుంచే రికవరీ చేయాలన్నారు.
ఈ చర్యకు పాల్పడిన ప్రత్యక్ష నిందితులతో పాటు వారి వెనుక ఉండి ప్రోత్సహించిన సూత్రధారులను కూడా చట్టం ముందు నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి దుశ్చర్యలకు ఒడిగట్టకుండా కఠినమైన శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు బలంగా ఉండాలన్నారు.
{{/usCountry}}ఈ చర్యకు పాల్పడిన ప్రత్యక్ష నిందితులతో పాటు వారి వెనుక ఉండి ప్రోత్సహించిన సూత్రధారులను కూడా చట్టం ముందు నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి దుశ్చర్యలకు ఒడిగట్టకుండా కఠినమైన శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు బలంగా ఉండాలన్నారు.
{{/usCountry}}'ప్రజల సౌకర్యార్థం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనంతో రోడ్లు నిర్మిస్తుంటే, రాజకీయం పేరుతో వాటిని తవ్వేయడం అమానుషం. ఇలాంటి మనస్తత్వాలను ఇకపై ఎంతమాత్రం సహించేది లేదు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చే శక్తుల ఆటలు ఇక సాగవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.' అని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు.
గ్రామస్థులు ఇచ్చిన ఆధారాలు, ఫిర్యాదు మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పుల్లంపేట పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అధికారులు తెలిపారు. ప్రజా ఆస్తుల విధ్వంసం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.