రోడ్డును ట్రాక్టర్‌తో తవ్విన వైసీపీ నేతలు.. నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని పవన్ ఆదేశాలు
ఇటీవల వేసిన రోడ్డును ట్రాక్టర్‌తో వైసీపీ నేతలు తవ్వడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసినవారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
తిరుపతి జిల్లా పరిధిలో కొత్తగా నిర్మించిన రహదారిని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రాక్టర్‌తో తవ్వి ధ్వంసం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని స్పష్టం చేసిన ఆయన, బాధ్యులైన వారిపై నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కఠిన కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

తిరుపతి జిల్లా పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం గ్రామం నుంచి పాపక్కగారిపల్లె వరకు వెళ్లే బీటీ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ. 4.75 కోట్ల వ్యయంతో పునర్నిర్మించింది.
అయితే రోడ్డు నిర్మాణం పూర్తయిన వారం రోజులకే.. వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలు కలిసి ట్రాక్టర్ ఉపయోగించి సుమారు 100 మీటర్ల మేర బీటీ రోడ్డును పూర్తిగా దున్నేసి ధ్వంసం చేశారు. ఈ విధ్వంసాన్ని గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్న పవన్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డి, అతనికి సహకరించిన వారిపై చట్టప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పవన్ ఆదేశించారు. ధ్వంసమైన రహదారి పునర్నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును నిందితుల నుంచే రికవరీ చేయాలన్నారు.
ఈ చర్యకు పాల్పడిన ప్రత్యక్ష నిందితులతో పాటు వారి వెనుక ఉండి ప్రోత్సహించిన సూత్రధారులను కూడా చట్టం ముందు నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి దుశ్చర్యలకు ఒడిగట్టకుండా కఠినమైన శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు బలంగా ఉండాలన్నారు.
'ప్రజల సౌకర్యార్థం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనంతో రోడ్లు నిర్మిస్తుంటే, రాజకీయం పేరుతో వాటిని తవ్వేయడం అమానుషం. ఇలాంటి మనస్తత్వాలను ఇకపై ఎంతమాత్రం సహించేది లేదు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చే శక్తుల ఆటలు ఇక సాగవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.' అని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు.
గ్రామస్థులు ఇచ్చిన ఆధారాలు, ఫిర్యాదు మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పుల్లంపేట పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని అధికారులు తెలిపారు. ప్రజా ఆస్తుల విధ్వంసం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


