...
...
Next Story

ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న తెలుగు క్రైమ్ డ్రామా.. 7.5 రేటింగ్.. ఈ మూడింట్లో చూసేయండి!

ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ డ్రామా చిత్రం 23 దూసుకుపోతోంది. ఇటీవల ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన 23 సినిమా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. 7.5 రేటింగ్ సాధించుకున్న ఇరవై మూడు ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్, సినిమాలోని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 29, 2025, 11:29:01 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలోకి ప్రతి రోజు ఏదో ఒక సినిమా రావడం, వాటిలో కొన్ని ట్రెండింగ్‌లో దూసుకెళ్లడం సాధారణంగా జరిగే విషయమే. అయితే, మంచి కంటెంట్ ఉన్నప్పటికీ థియేటర్లలో ఆడియెన్స్ ఆదరణ నోచుకోని, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ అందుకోని సినిమాలు ఎన్నో ఉన్నాయి.

థియేటర్లలో దక్కని రెస్పాన్స్

ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న తెలుగు క్రైమ్ డ్రామా.. 7.5 రేటింగ్.. ఈ మూడింట్లో చూసేయండి!
ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న తెలుగు క్రైమ్ డ్రామా.. 7.5 రేటింగ్.. ఈ మూడింట్లో చూసేయండి!

అలాంటి మూవీస్‌కు ఓటీటీలు మంచి ప్లాట్‌ఫామ్స్‌గా ఉంటున్నాయి. థియేటర్లలో దక్కని రెస్పాన్స్‌ను ఓటీటీల్లో సంపాదించుకుంటున్నాయి. అయితే, ఓటీటీ రిలీజ్, ఓటీటీ ట్రెండింగ్ ఇప్పుడు చాలా సాధారణమైనప్పటికీ అందరి దృష్టిని ఒక సినిమా ఆకర్షిస్తుందంటే ఏదో ఒక మంచి కారణం ఉండే ఉంటుంది.

మంచి సినిమాగా 23

అలా ఒక మంచి చిత్రంగా ఓటీటీలో దూసుకుపోతోన్న మూవీనే 23 (ఇరవై మూడు). ఏ ఏడాది థియేటర్లలో మే 16న థియేటర్లలో విడుదలైన 23 మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. మంచి కంటెంట్, కాన్సెప్ట్, సోషల్ డ్రామా, సామాజిక అవగాహన వంటి అంశాలు ఉన్నాయని ప్రశంసలు కురిశాయి.

ఐఎమ్‌డీబీ రేటింగ్

అంతేకాకుండా ఐఎమ్డీబీ నుంచి పదికి 7.5 రేటింగ్‌ను సంపాదించుకుంది 23 మూవీ. కానీ, ఊహించనంత స్థాయిలో కమర్షయిల్‌గా హిట్ కాలేకపోయింది. అయితే, రీసెంట్‌గా 23 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అది కూడా ఏకంగా 3 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో 23 డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

ఓటీటీ ట్రెండింగ్‌లో 23

ఆహా, ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ మూడింట్లో 23 ఓటీటీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఇరవై మూడు సినిమా. ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న 23 మూవీ ఆహాలో ఓటీటీ ట్రెండింగ్‌ సినిమాల్లో టాప్ 2 స్థానం దక్కించుకుంది.

పుట్టబోయే బిడ్డ కోసం

కానీ, హీరో చేసే ఆ దొంగతనం 23 మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. అది ఎలా జరిగింది? దొంగతనంతో 23 మంది మరణాలు ఎలా జరిగాయి? ఆ తర్వాత హీరో పరిస్థితి ఏమైంది? వంటి థ్రిల్లింగ్ ఎమోషనల్ సీన్లతో 23 తెరకెక్కింది. ఫీల్ గుడ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే 23 మూవీని అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, ఆహా మూడు ఓటీటీల్లో ఎంచక్కా చూసేయండి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe