తొడగొట్టి విజయ్ దేవరకొండకు సవాలు విసిరిన #90's వెబ్ సిరీస్ యాక్టర్.. నీకు ఏం కావాలంటే అది ఇస్తానన్న రౌడీ బాయ్
విజయ్ దేవరకొండకు తొడగొట్టి మరీ సవాలు విసిరాడు 90's వెబ్ సిరీస్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్. తనకు, తన ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో మూవీ టీమ్ అందరికీ రౌడీ టీషర్ట్స్ కావాలని డిమాండ్ చేశాడు. దీనికి విజయ్ స్పందిస్తూ.. నీకు ఏది కావాలంటే అది ఇస్తానని అనడం విశేషం.
ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన #90's వెబ్ సిరీస్ లో సాంప్రదాయిని సుప్పిని అంటూ ఆదిత్య పాత్రలో నటించిన రోహన్ రాయ్ గుర్తున్నాడు. ఇప్పుడు అతడు తొడగొట్టి మరీ విజయ్ దేవరకొండకు సవాలు విసిరాడు. దీనికి రౌడీ బాయ్ కూడా ఎక్స్ వేదికగా రియాక్ట్ కావడం విశేషం. నీకు ఏది కావాలంటే అది ఇస్తానని అన్నాడు.

రోహన్ తొడగొట్టి..
ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన ఆ #90's వెబ్ సిరీస్ తో ప్రతి తెలుగు వారి ఇంట్లో ప్రత్యేక స్థానం సంపాదించిన చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్. తాజాగా అతడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీలో నటించాడు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా అతడు మాట్లాడాడు.
అప్పుడే అతడు తొడగొట్టి.. విజయ్ దేవరకొండన్నా.. టీజర్ రిలీజ్ అప్పుడు కూడా చెప్పాను.. నా సైజు ఎస్.. మా మొత్తం టీమ్ కు రౌడీ షర్టులు రెడీగా పెట్టుకో అని అతడు అన్నాడు. ఈ వీడియో తెగ వైరల్ అయింది. దీనిని చూసిన విజయ్ ఎక్స్ లోనే స్పందించాడు.
నీకు ఏం కావాలన్నా ఇస్తా
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై గురువారం (నవంబర్ 6) రాత్రి విజయ్ దేవరకొండ స్పందించాడు. ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ.. “రోహన్.. నీకు ఏది కావాలంటే అది నేనిస్తాను. 90's చూసినప్పటి నుంచీ నేను నీ అభిమానిని. నేను నిన్న త్వరలోనే కలుస్తాను. ప్రీ వెడ్డింగ్ షో టీమ్ మొత్తానికి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను” అని విజయ్ ట్వీట్ చేశాడు.
ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో గురించి..
ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో సినిమాను రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశాడు. ఇందులో తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ లాంటి వాళ్లు నటించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించాడు. శుక్రవారం (నవంబర్ 7) రిలీజైన ఈ సినిమాకు మంచి రివ్యూలే వస్తున్నాయి. ఈ మూవీలో ప్రీ వెడ్డింగ్ షూట్ కు సంబంధించిన చిప్ పోవడం, దానిని వెతకడం, ఆ క్రమంలో ఎదురయ్యే ఫన్నీ అనుభవాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో రమేష్ అనే పాత్రలో తిరువీర్, రామ్ చరణ్ పాత్రలో మాస్టర్ రోహన్ నటించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


