బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ను ఎప్పుడైనా పాన్ నములుతూ చూశారా? మీరే కాదు ఎవరూ చూసి ఉండకపోవచ్చు. కానీ ఒకానొక సమయంలో అతడు ఏకంగా రోజుకు వంద పాన్లు నమిలేవాడట. అయితే అది అంత వ్యసనంలా మారిపోయిందా అని అనుకోకండి. ఓ సినిమాలో తాను పోషించిన పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ఆమిర్ ఈ పని చేశాడట. ఇది 2014లో విడుదలైన 'పీకే' సినిమా షూటింగ్‌లో కావడం విశేషం. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
రోజుకు వంద పాన్లు.. కారణం ఇదే

'పీకే' సినిమాలో ఆమిర్ ఖాన్ గ్రహాంతరవాసి (ఏలియన్) పాత్ర పోషించాడు. ఒక లక్ష్యంతో భూమి పైకి వచ్చిన అతడు.. అనుకోకుండా ఇక్కడే చిక్కుకుపోతాడు. తన అసాధారణ శక్తులతో భూమిపై మనుషుల భాష, వారి జీవన విధానం, ఆహారపు అలవాట్లు నేర్చుకుంటాడు.
ఈ క్రమంలో సినిమాలో అతని పాత్ర నిరంతరం పాన్ నములుతూ కనిపిస్తుంది. అందుకే షూటింగ్ సమయంలో ఆమిర్ ఖాన్ ప్రతిరోజూ పాన్ నములుతూనే ఉండేవాడట. ఈ విషయం గురించి ఆమిర్ ఖాన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
పెదవులు ఎర్రగా కనిపించేందుకు..
"నేను రోజుకు 100 పాన్ల వరకు నమిలేవాడిని" అని ఆమిర్ ఖాన్ ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. అతని కోసం షూటింగ్ సెట్‌లో ఒక పాన్‌వాలా (పాన్ తయారుచేసే వ్యక్తి) ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడట.
ఆమిర్ ఖాన్ తన పాత్రలో నిజమైన అనుభూతి తీసుకురావడానికి అలా చేసేవాడు. పాన్ నమలడం వల్ల అతని పెదవులు సహజంగా ఎర్రగా కనిపించేవి. అంతేకాదు పాన్ నములుతున్నప్పుడు వచ్చే ఆ సహజమైన ఉచ్చారణ (యాస) కూడా ఆ పాత్రకు చాలా అవసరం. అందుకే అంత కష్టమైనా అతడు రోజంతా పాన్ తింటూనే ఉండేవాడు.
అయితే ఈ పర్ఫెక్షనిజం వల్ల అతడు పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. నిరంతరం పాన్ నమలడం వల్ల ఆమిర్ ఖాన్‌కు నోటిలో పొక్కులు వచ్చాయట. దీంతో అతడు చాలా బాధపడ్డాడు. "పాత్రలో నిజాయితీ కోసమే ఆ కష్టం భరించాను" అని అతడు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూలో ఆమిర్‌తో పాటు ఉన్న కో-స్టార్ అనుష్క శర్మ సైతం.. ఆమిర్ ఖాన్ రోజంతా ఇష్టమున్నా, లేకపోయినా పాన్లు తినడం చూసి చాలా బాధేసేది అని చెప్పింది.
'పీకే' సినిమా బడ్జెట్, వసూళ్లు
{{/usCountry}}అయితే ఈ పర్ఫెక్షనిజం వల్ల అతడు పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. నిరంతరం పాన్ నమలడం వల్ల ఆమిర్ ఖాన్‌కు నోటిలో పొక్కులు వచ్చాయట. దీంతో అతడు చాలా బాధపడ్డాడు. "పాత్రలో నిజాయితీ కోసమే ఆ కష్టం భరించాను" అని అతడు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూలో ఆమిర్‌తో పాటు ఉన్న కో-స్టార్ అనుష్క శర్మ సైతం.. ఆమిర్ ఖాన్ రోజంతా ఇష్టమున్నా, లేకపోయినా పాన్లు తినడం చూసి చాలా బాధేసేది అని చెప్పింది.
'పీకే' సినిమా బడ్జెట్, వసూళ్లు
{{/usCountry}}ఆమిర్ ఖాన్, అనుష్క శర్మ కలిసి నటించిన ఈ 'పీకే' సినిమా దాదాపు రూ. 85 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రం దేశీయంగా రూ. 122 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసి అద్భుత విజయాన్ని సాధించింది. ఆమిర్ పర్ఫెక్షనిజం, రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వ ప్రతిభకు ఇది నిదర్శనం.