Aamir Khan Third Marriage: మూడో పెళ్లికి సిద్ధమైన అమీర్ ఖాన్.. జూలై 5న గౌరీతో వెడ్డింగ్ ఎలా జరుగుతుందో చెప్పిన హీరో!

Aamir Khan Third Marriage: ​బాలీవుడ్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అమీర్ ఖాన్ మూడో పెళ్లికి రెడీ అయ్యాడు. తన లాంగ్ టైమ్ గర్ల్‌ఫ్రెండ్, ప్రముఖ వ్యాపారవేత్త గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ముంబైలో జరిగే ఈ మ్యారేజ్ వేడుకకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Published on: Jul 3, 2026, 11:06:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Aamir Khan Third Marriage: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) తన మూడో వివాహానికి సిద్ధమయ్యాడు. గౌరీ స్ప్రాట్ (Gauri Spratt)ను పెళ్లాడబోతున్నట్లు మీడియా సమక్షంలో స్వయంగా ప్రకటించాడు. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ రూపొందించిన సరికొత్త ఓటీటీ సిరీస్ ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా అమీర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

మూడో పెళ్లికి సిద్ధమైన అమీర్ ఖాన్.. జూలై 5న గౌరీతో వెడ్డింగ్ ఎలా జరుగుతుందో చెప్పిన హీరో!
మూడో పెళ్లికి సిద్ధమైన అమీర్ ఖాన్.. జూలై 5న గౌరీతో వెడ్డింగ్ ఎలా జరుగుతుందో చెప్పిన హీరో!

అమీర్ ఖాన్ కామెంట్లు

ప్రీతమ్ అండ్ పెడ్రో ఓటీటీ సిరీస్ స్క్రీనింగ్ ఈవెంట్‌లో అమీర్ ఖాన్ తన పెళ్లిపై స్పందిస్తూ.. "అవును, జూలై 5న నా వివాహం జరగబోతోంది. ఇది చాలా చిన్న వేడుక. మా ఇంట్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. జూలై 5 అనేది మా ఇద్దరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది అత్యంత సన్నిహితులు మాత్రమే దీనికి హాజరవుతారు’’ అని స్పష్టం చేశాడు.

ఆశీస్సులు కావాలంటూ

‘‘మా కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు, దీవెనలు కావాలి. మేము సంతోషంగా ఉండాలని ప్రార్థించండి" అని అమీర్ ఖాన్ కోరాడు. అమీర్ ఖాన్ కామెంట్ల నేపథ్యంలో ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఎలాంటి గ్రాండ్ రిసెప్షన్ లేదా బాలీవుడ్ స్టార్స్ హడావుడి ఉండబోదని తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్‌లో అమీర్ పెద్ద కుమారుడు జునైద్ ఖాన్ కూడా తండ్రి పక్కనే ఉండి మద్దతుగా నిలవడం విశేషం.

గౌరీ స్ప్రాట్ బ్యాక్‌డ్రాప్ ఏంటి?

గౌరీ స్ప్రాట్ బెంగళూరుకు చెందిన ప్రముఖ సెలూన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఫ్యాషన్ స్టైలిస్ట్. లండన్‌లోని 'యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్' నుంచి ఫ్యాషన్ రంగంలో విద్యనభ్యసించిన ఆమె, ప్రస్తుతం ముంబైలో ‘బి బ్లెంట్’ సెలూన్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. అంతేకాకుండా 'అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్' లోనూ ఆమె అసోసియేట్‌గా వ్యవహరిస్తోంది. గౌరీకి ఇది రెండో పెళ్లి. ఆమెకు 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

అమీర్ ఖాన్ పెళ్లిళ్లు

​అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో ఇది మూడో వివాహం. అంతకుముందు ఆయన ఇద్దరిని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నాడు.

  • ​మొదటి భార్య - రీనా దత్తా (Reena Dutta): 1986లో వీరి వివాహం జరగ్గా, 2002లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వీరికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
  • ​రెండో భార్య - కిరణ్ రావు (Kiran Rao): 2005లో వివాహం చేసుకోగా, 2021లో ఈ జంట విడాకులు ప్రకటించారు. వీరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. విడాకుల తర్వాత కూడా వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటూ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు.
  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More