OTT: రిలీజ్‌కు ముందే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న తెలుగు ఓటీటీ సిరీస్.. ప్రీమియర్స్‌కు ఫిదా.. అంతలా ఏముంది?
OTT: సాధారణంగా వెబ్ సిరీస్ లు అంటే ఓటీటీలో రిలీజ్ అయ్యాక హైలైట్ అవుతాయి. కానీ ఈ వెబ్ సిరీస్ మాత్రం ఓటీటీ రిలీజ్ కంటే ముందే తెగ వైరల్ గా మారుతోంది. ఈ సిరీస్ ప్రీమియర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కడమే ఇందుకు కారణం. అసలు ఈ సిరీస్ ఏంటీ? ఇందులో ఏముంది? అనేది ఇక్కడ చూసేయండి.
OTT: ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తెలుగు ఓటీటీ వెబ్ సిరీస్ ఏదైనా ఉందంటే.. అది ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీసే. ఇంకా ఓటీటీలో రిలీజ్ కాని ఈ సిరీస్ గురించి ట్విటర్ లో మోత మోగుతోంది. ఎక్స్ లో అందరూ పాజిటివ్ రివ్యూస్ తో ఈ సిరీస్ పై హైప్ ను మరింత పెంచేస్తున్నారు. ఇది ప్యూర్ నోస్టాల్జియా మూమెంట్ అని అందరూ అంటున్నారు.

గుర్తుకొస్తున్నాయి ఓటీటీ
సింపుల్ కథలనే మనసులకు హత్తుకునేలా తీస్తూ ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ బ్లాక్ బస్టర్లు కొడుతోంది. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’, ‘అనగనగా’ అలాంటి కథలే. ఇప్పుడు ఇదే కోవలో ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ వచ్చేస్తోంది. ఈ నోస్టాల్జియా సిరీస్ రేపటి (జూలై 3) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ముందుగానే థియేటర్లలో వేసిన ఈ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్సాన్స్ వస్తోంది.
ప్యూర్ నోస్టాల్జియా
కొన్ని సినిమాలు లేదా సిరీస్ లు చూసినంత సేపు ఎంటర్ టైన్ చేస్తాయి. కానీ ఆ తర్వాత మర్చిపోతాం. కానీ కొన్ని మాత్రం మనతోనే ట్రావెల్ అవుతాయి. మనల్ని ఆ కథలోకి తీసుకెళ్తాయి. తెరపై మనల్ని మనం చూసుకునేలా చేస్తాయి. ఈ గుర్తుకొస్తున్నాయి సిరీస్ కూడా అలాంటిదేననే టాక్ వినిపిస్తోంది. ముఖ్యం 30 ఏళ్ల యూత్ ను తమ బాల్యంలోకి తీసుకెళ్లే పర్ఫెక్ట్ ప్యూర్ నోస్టాల్జియా ఇది అని అంటున్నారు.
అన్ని ఎమోషన్లు
తాడు కట్టే తిప్పే బొంగరం నుంచి గోలీల వరకు 90స్ కిడ్స్ చిన్నప్పుడు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇప్పుడీ గుర్తుకొస్తున్నాయి సిరీస్ లో ఈ అల్లరినంతా మరోసారి చూడొచ్చని నెటిజన్లు మెన్షన్ చేస్తున్నారు. చిన్నప్పటి అల్లరి, ఫ్రెండ్ షిప్, లవ్, తల్లిదండ్రుల అనుబంధం.. ఇలా ఈ సిరీస్ లో అన్ని ఎమోషన్లు ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
స్టోరీ ఏంటంటే?
గుర్తుకొస్తున్నాయి సిరీస్ లో ‘బేబీ’ ఫేమ్ విరాజ్ హీరోగా నటించాడు. యశశ్రీ రావు హీరోయిన్. సంతోష్ (విరాజ్), వైశాలి (యశశ్రీ) స్కూల్ లో క్లాస్ మేట్స్. వీళ్లు లవ్ చేసుకుంటారు. వైశాలి తండ్రి ఏమో అదే స్కూల్ హెడ్ మాస్టర్ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్). రఘునాథ్ ను ఒప్పించి మరీ సంతోష్ పెళ్లికి రెడీ అవుతాడు.
అయితే గోవాలో బ్యాచిలర్స్ పార్టీ కోసం తన ఫ్రెండ్స్ గణేష్, శ్రీకాంత్, ఆనంద్ తో కలిసి సంతోష్ వెళ్తాడు. ఆ క్రమంలో యాక్సిడెంట్ కావడంతో సంతోష్ గతాన్ని మర్చిపోతాడు. మరి సంతోష్ కు గతం గుర్తొచ్చిందా? వైశాలితో పెళ్లి జరిగిందా? అన్నదే గుర్తుకొస్తున్నాయి సిరీస్ స్టోరీ.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


