Today Ott: ఇవాళ ఓటీటీలోకి రెండు తెలుగు వెబ్ సిరీస్ లు.. కామెడీ డ్రామా నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇవి ఎందుకు చూడాలంటే?

Today OTT: డిజిటల్ స్క్రీన్‌పై వినోదాన్ని పంచేందుకు రెండు క్రేజీ వెబ్ సిరీస్ లు సిద్ధమయ్యాయి. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ డ్రామా ‘సూపర్ సుబ్బు’, సముద్రఖని లీడ్ రోల్‌లో నటించిన రా యాక్షన్ థ్రిల్లర్ ‘ఇసాకపట్నం’ ఇవాళ ఓటీటీలో అడుగుపెడుతున్నాయి. మరి ఈ సిరీస్ లను ఎందుకు చూడాలో తెలుసుకోండి.

Published on: Jul 2, 2026, 06:11:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమా లవర్స్‌కు వీకెండ్ ఓటీటీ వినోదం అదిరిపోనుంది. విభిన్న కథాంశాలతో రెండు క్రేజీ వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటి స్ట్రీమింగ్ వివరాలు, కథ, ప్రత్యేకతలు మీకోసం.

ఓటీటీలోకి ఇవాళ రెండు సిరీస్ లు (x)
ఓటీటీలోకి ఇవాళ రెండు సిరీస్ లు (x)

​1. సూపర్ సుబ్బు (Super Subbu)

​ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

​స్ట్రీమింగ్ తేదీ: జూలై 2, 2026

​జోనర్: కామెడీ డ్రామా

​తారాగణం: సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, బ్రహ్మానందం, మురళీ శర్మ, మానస చౌదరి, గెటప్ శ్రీను తదితరులు

​దర్శకత్వం: మల్లిక్ రామ్

​కథాంశం: 'మాకిపూర్' అనే ఒక వింతైన, విచిత్రమైన ప్రజలు ఉండే గ్రామానికి పబ్లిక్ అవేర్‌నెస్ ఆఫీసర్‌గా వస్తాడు సుబ్రహ్మణ్యం చిలుకూరి రావు అలియాస్ సుబ్బు (సందీప్ కిషన్). అమాయకత్వం, వింత ప్రవర్తన కలిగిన ఆ ఊరి గ్రామస్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పే క్రమంలో అతను సమస్యల్లో చిక్కుకుంటాడు. దీంతో అతని కెరీర్, లవ్ లైఫ్, ఫ్యామిలీని ఎలా రిస్క్‌లో పడ్డాయన్నదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఈ సిరీస్ ఇవాళ (జూలై 2) మధ్యాహ్నం 12.30 గంటలకు రిలీజ్ కానుంది.

​ఎందుకు చూడాలి?

కామెడీ స్టార్లు: లెజెండరీ హాస్యనటుడు బ్రహ్మానందం, గెటప్ శ్రీను, సందీప్ కిషన్‌ల కలయికలో వచ్చే సీన్లు నాన్-స్టాప్ హ్యూమర్‌ను అందిస్తాయి. వారి టైమింగ్ ఈ సిరీస్ కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

​క్రేజీ విలేజ్ సెటప్: మాకిపూర్ గ్రామం, అక్కడి విచిత్రమైన జనాలు ఒక అవుట్ అండ్ అవుట్ సాటైరికల్ కామెడీకి పర్‌ఫెక్ట్ బ్యాక్‌డ్రాప్‌గా నిలుస్తాయి.

ఫస్ట్ టైమ్: నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫస్ట్ టైమ్ తెలుగులో తీసుకొచ్చిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇది. మంచి కామెడీ డ్రామా కావాలనుకునే వాళ్లకు సూపర్ సుబ్బు సిరీస్ మంచి ఆప్షన్.

​2. ఇసాకపట్నం (Isakapatnam)

​ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)

​స్ట్రీమింగ్ తేదీ: జూలై 2, 2026

​జోనర్: యాక్షన్ థ్రిల్లర్

​తారాగణం: సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, సునీల్, నరేష్ అగస్త్య, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, రోహిణి తదితరులు

​దర్శకత్వం: గ్యారీ బీహెచ్

​కథాంశం: కోట్లు కురిపించే షిప్పింగ్ డాక్స్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. ఒక క్రూరమైన మాఫియా డాన్ నాయుడు (సముద్రఖని), అతని కుమార్తె భారతి (ఐశ్వర్య రాజేష్) మధ్య జరిగే స్టోరీ. తండ్రి చేసే నేర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా భారతి తిరుగుబాటు చేయడంతో వారి మధ్య తీవ్రమైన వ్యక్తిగత యుద్ధం మొదలవుతుంది.

ఈ గ్యాప్‌లో ప్రత్యర్థి వర్గాలు ఆ సామ్రాజ్యాన్ని దక్కించుకోవాలని చూస్తుంటే, ఒక యంగ్ అండ్ ఐడియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్ ఈ అవకాశాన్ని వాడుకుని ఆ సిండికేట్‌ను ఎలా అంతం చేశాడనేది మిగిలిన కథ. ఈ సిరీస్ ఇప్పటికే స్ట్రీమింగ్ మొదలైంది.

​ఎందుకు చూడాలి?

​ఎమోషనల్ హై-స్టేక్స్ డ్రామా: ఇది కేవలం రొటీన్ గ్యాంగ్ వార్ కాదు. ఒక పవర్‌ఫుల్ తండ్రి, తిరుగుబాటు చేసిన కూతురి మధ్య సాగే ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ బ్యాటిల్.

​గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్: క్రైమ్ సిండికేట్స్, పోర్ట్ పాలిటిక్స్, టాక్టికల్ పోలీస్ ఆపరేషన్స్, పొలిటికల్ ఇంట్రిగ్‌లను ఇష్టపడే యాక్షన్ లవర్స్‌కు ఇది బెస్ట్ ఛాయిస్.

​నటీనటుల పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్: సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, సునీల్, రోహిణిల వంటి పవర్‌హౌస్ పెర్ఫార్మర్ల నటన ఈ చిత్రంలోని క్యారెక్టర్ డైనమిక్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More