Telugu Web Series: మరికొన్ని గంటల్లోనే నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్.. సందీప్ కిషన్ బోల్డ్ క్యారెక్టర్

Telugu Web Series: నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా నటించిన ఈ బోల్డ్ సిరీస్ గురువారం (జులై 2) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

Published on: Jul 1, 2026, 17:43:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu Web Series: తెలుగు వెబ్ సిరీస్‌లకు క్రమంగా ఆడియెన్స్ నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఇన్నాళ్లకు ఓ సిరీస్ ను తీసుకొస్తోంది. అది కూడా సెక్స్ ఎడ్యుకేషన్ లాంటి ఓ బోల్డ్ సబ్జెక్ట్ ను ప్రముఖ టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ లీడ్ రోల్లో తీసుకొస్తుండటం విశేషం. మాకీ పూర్ అనే ఊరు చుట్టూ తిరిగే ఈ సిరీస్ గురువారం (జులై 2) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Telugu Web Series: మరికొన్ని గంటల్లోనే నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్.. సందీప్ కిషన్ బోల్డ్ క్యారెక్టర్
Telugu Web Series: మరికొన్ని గంటల్లోనే నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్.. సందీప్ కిషన్ బోల్డ్ క్యారెక్టర్

సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్

సూపర్ సుబ్బు పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ సిరీస్ ను ప్రమోట్ చేస్తున్న ఆ ఓటీటీ.. తాజాగా మరొక్క రోజులోనే అంటూ ట్వీట్ చేసింది. “మాకీపూర్ పిలుస్తోంది.. సుబ్బు త్వరలోనే రానున్నాడు” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది.

ఒకే ఒక్క రోజులోనే అంటూ సందీప్ కిషన్ పోస్టర్ ను ఈ పోస్ట్ తో షేర్ చేసింది. ఈ వెబ్ సిరీస్ తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది.

సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ విశేషాలు

ఈ మధ్యే సూపర్ సుబ్బు ట్రైలర్ ను కూడా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. 'డీజే టిల్లు' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మల్లిక్ రామ్ ఈ సిరీస్‌ను తన మార్క్ హిలేరియస్ ఎంటర్‌టైనింగ్‌ స్టైల్‌లో తెరకెక్కించారు.

ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ చాలా డిఫరెంట్‌గా, బోల్డ్‌గా ఉంది. హీరో సుబ్బు (సందీప్ కిషన్) చిన్న వయసులో ఉన్నప్పుడే అతని తండ్రి (మురళీ శర్మ) కొడుకు మైండ్ అస్సలు పాడవకూడదని, ఎలాంటి శృంగార ఆలోచనలు రాకుండా ఉండటానికి చేతికి ఒక స్పెషల్ బ్యాండ్ వేస్తాడు. కట్ చేస్తే.. పెద్దయ్యాక సుబ్బు ఒక గవర్నమెంట్ స్కూల్‌లో టెంపరరీ స్టాఫ్‌గా పని చేస్తూ ఎలాగైనా పర్మినెంట్ జాబ్ సంపాదించాలని ట్రై చేస్తుంటాడు.

కానీ విధి అతని జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది. దేశంలోనే అత్యధిక సంతానోత్పత్తి రేటు (Fertility Rate) ఉన్న 'మాకీపూర్' అనే పల్లెటూరికి సుబ్బును సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది గవర్నమెంట్. జనాభా నియంత్రణ లేని ఆ ఊరిలో సుబ్బు అడుగుపెట్టిన తర్వాత కథ మొత్తం సంచలనంగా మారుతుంది.

మాకీపూర్ జనాల తిరుగుబాటు.. సందీప్ కిషన్ వన్ మ్యాన్ షో

సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా మాకీపూర్ వెళ్లిన సుబ్బు.. అక్కడ గ్రామస్తులకు ఆడవాళ్ల సమ్మతి గురించి వివరించడంతోపాటు మితిమీరిన జనాభా వల్ల వచ్చే సమస్యల గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆ ఊరి మగవాళ్లకు సుబ్బు చెప్పే విషయాలు అస్సలు నచ్చవు. దాంతో వాళ్లంతా కలిసి హీరోను తరుముకుంటూ వస్తుంటారు. ఈ ఛేజింగ్ సీన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కలిసి మంచి ఫన్ జనరేట్ చేస్తున్నాయి.

ఈ వెబ్ సిరీస్‌లో సందీప్ కిషన్ లుక్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. ఒక మంచి సోషల్ మెసేజ్‌ ఉన్న పాయింట్‌ను ఎక్కడా బోర్ కొట్టకుండా ప్యూర్ కామెడీ జోనర్‌లో మల్లిక్ రామ్ తీసుకొస్తున్న తీరు అద్భుతంగా ఉంది. రూరల్ బ్యాక్‌డ్రాప్ లో సాగే విజువల్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో ఒక బిగ్గెస్ట్ ఇండియన్ ఒరిజినల్ హిట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సూపర్ సుబ్బు వెబ్ సిరీస్‌ను చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, భరత్ లక్ష్మీపతి ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ మిథిలా పాల్కర్ ఇందులో హీరోయిన్‌గా నటించగా, టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ క్రేజీ క్యారెక్టర్‌లో మెరవనున్నారు.

వీరితో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది, గెటప్ శ్రీను, మానస చౌదరి, రఘుబాబు లాంటి స్టార్ కమెడియన్లు ఉండటంతో సిరీస్‌లో నవ్వుల విందు గ్యారెంటీ అని చెప్పొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More