Aamir Khan Dhurandhar 2: పొగడ్తలే విన్నాను కానీ సినిమా ఇంకా చూడలేదు: ధురంధర్ 2పై ఆమిర్ ఖాన్ కామెంట్స్ వైరల్
Aamir Khan Dhurandhar 2: ధురంధర్ 2 మూవీని తాను ఇంకా చూడలేదని అన్నాడు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్. ఈ సినిమాపై టాలీవుడ్ నుంచి ఎన్నో ప్రశంసలు వస్తున్నా.. బాలీవుడ్ మౌనంగా ఉండటంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ సెన్సేషనల్ రన్‌తో దూసుకుపోతోంది. ఈ యాక్షన్ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఆలియా భట్ నుంచి కంగనా రనౌత్ వరకు, అలాగే అల్లు అర్జున్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు చాలామంది స్టార్లు ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో చిత్ర బృందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అయితే ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఈ రణ్‌వీర్ సింగ్ సినిమా గురించి స్పందించాడు. తాను ఇంకా ఈ సినిమా చూడకపోయినా, ఎక్కడ విన్నా ఈ సినిమా గురించిన ప్రశంసలే వినిపిస్తున్నాయని ఆమిర్ చెప్పడం విశేషం.
ఆమిర్ ఖాన్ ఏమన్నాడంటే..
2026 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీలో (ఐఎఫ్ఎఫ్‌డీ) రెండో రోజు కార్యక్రమంలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు. "నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. కానీ ఆ సినిమా గురించి మాత్రం అద్భుతమైన పొగడ్తలు వింటున్నాను. ధురంధర్ ఫస్ట్ పార్ట్, ఇప్పుడు ధురంధర్ 2.. ఈ రెండు సినిమాలు అసాధారణమైన విజయం సాధించాయి. ఆ సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్" అని ఆమిర్ అన్నాడు.
ఇదే ఫెస్టివల్‌లో తన సొంత సినిమా సితారే జమీన్ పర్ స్క్రీనింగ్ గురించి కూడా ఆమిర్ ఎంతో సంతోషంగా మాట్లాడాడు. "మా సితారే జమీన్ పర్ సినిమాను ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ ఫెస్టివల్ జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కదా? అవును ఫస్ట్ టైమే. మా సినిమాను ఇక్కడ స్క్రీన్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రసన్న ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఇచ్చిన సందేశం పట్ల మేమిద్దరం చాలా గర్వంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉన్న ఆడియన్స్‌తో.. ముఖ్యంగా యువతతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది మాకు ఒక మంచి అవకాశం ఇస్తుంది" అని ఆయన వివరించాడు.
ధురంధర్ సినిమాల స్టోరీ ఏంటంటే..
2025 డిసెంబర్‌లో రిలీజై సూపర్ హిట్ అయిన దురంధర్ సినిమాకు ఇది సీక్వెల్. ఫస్ట్ పార్ట్‌లో పాకిస్థాన్‌లోని ల్యారీలో ఉన్న ఒక బలూచ్ గ్యాంగ్‌లోకి హమ్జా ఎలా ఎంటర్ అయ్యాడు, ఒక టెర్రరిస్ట్ సంస్థను ఎలా నాశనం చేశాడు అనేది ఆసక్తికరంగా చూపించారు. ఇక ఇప్పుడు వచ్చిన సీక్వెల్‌లో జస్కిరత్ అసలు హమ్జాగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే బ్యాక్‌స్టోరీని చాలా వివరంగా ఎమోషనల్‌గా చూపించారు.
రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, డానిష్ పాండోర్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఇందులో తమ పాత పాత్రలనే మళ్లీ పోషించారు. ధురంధర్ ఫస్ట్ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లు వసూలు చేసింది, రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత కూడా ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఇప్పుడు ఈ సీక్వెల్ అంతకంటే పెద్ద హిట్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.
ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (డీటీటీడీసీ), అలాగే ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా కేపీఎంజీ నాలెడ్జ్ పార్ట్‌నర్‌షిప్‌తో ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీని నిర్వహిస్తున్నాయి. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నగరమంతటా జరిగే ఒక పెద్ద ఈవెంట్. న్యూఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో మార్చి 25 నుంచి 31 వరకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


