...
...
Next Story

OTT Movie: మాట మార్చిన ఆమిర్ ఖాన్.. ఓటీటీలోకి వస్తున్న సితారే జమీన్ పర్.. ఇందులో చూసేయండి

ఆమిర్ ఖాన్ మాట మార్చాడు. తన మూవీ సితారే జమీన్ పర్ ఎప్పటికీ ఓటీటీలోకి రాదని చెప్పిన అతడు.. డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం చేస్తున్నాడు. సోనీ లివ్ ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచింది.

Published on: Mar 10, 2026, 15:46:10 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) నటించిన ఎమోషనల్ అండ్ ఇన్‌స్పైరింగ్ మూవీ ‘సితారే జమీన్ పర్’. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో అమీర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీ (OTT) లోకి రాదని, థియేట్రికల్ రన్ తర్వాత నేరుగా యూట్యూబ్ (YouTube) లోనే 'పే-పర్-వ్యూ' (Pay-per-view) పద్ధతిలో రిలీజ్ చేస్తానని తేల్చి చెప్పాడు. కానీ ఇప్పుడు ఎనిమిది నెలల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని ఈ బ్లాక్‌బస్టర్ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు.

సోనీ లివ్ (Sony LIV) లోకి 'సితారే జమీన్ పర్'

OTT Movie: మాట మార్చిన ఆమిర్ ఖాన్.. ఓటీటీలోకి వస్తున్న సితారే జమీన్ పర్.. ఇందులో చూసేయండి
OTT Movie: మాట మార్చిన ఆమిర్ ఖాన్.. ఓటీటీలోకి వస్తున్న సితారే జమీన్ పర్.. ఇందులో చూసేయండి

సోమవారం (మార్చి 9) నాడు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సోనీ లివ్' (Sony LIV) ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. గతేడాది (2025) జూన్‌లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. సుమారు ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్‌కు వస్తోంది. అయితే ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందనే కచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించలేదు, "త్వరలో" అని మాత్రమే వెల్లడించారు.

సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కానున్న మొట్టమొదటి హిందీ థియేట్రికల్ సినిమా ఇదే కావడం విశేషం. ఆర్ఎస్ ప్రసన్న డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ సరసన జెనీలియా దేశ్‌ముఖ్ నటించింది.

అసలు కథ, బాక్సాఫీస్ కలెక్షన్స్

2007లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన 'తారే జమీన్ పర్' (Taare Zameen Par) కు ఇది స్పిరిచ్యువల్ సీక్వెల్.

మందు తాగి డ్రైవింగ్ చేసిన (DUI) కేసులో ఇరుక్కున్న ఒక బాస్కెట్‌బాల్ కోచ్‌కు.. కోర్టు ఒక కఠినమైన షరతు విధిస్తుంది. 'న్యూరోడైవర్జెంట్' (Neurodivergent - ఆటిజం లేదా ఇతర నాడీ సంబంధిత ఎదుగుదల లోపాలు ఉన్నవారు) వ్యక్తుల బృందానికి బాస్కెట్‌బాల్ నేర్పించాలనేదే ఆ శిక్ష. ఆ తర్వాత వారి మధ్య సాగే ఎమోషనల్ జర్నీయే ఈ సినిమా కథ.

సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన ఆరు నెలల వరకు ఓటీటీకి ఇవ్వకూడదని అప్పట్లో ఆమిర్ గట్టిగా వాదించాడు. ఆ తర్వాత జూలైలో ముంబైలో జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో తాను అబద్ధం చెప్పినందుకు అభిమానులకు క్షమాపణలు కూడా కోరాడు.

"నేను రెండు చేతులు జోడించి క్షమాపణలు అడుగుతున్నాను. ఈ సినిమా యూట్యూబ్‌లో రాదు అని నేను అబద్ధం చెప్పాను. థియేట్రికల్ బిజినెస్‌ను కాపాడుకోవడానికే నాకు వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది. సినిమాతోనే నా జీవితం మొదలైంది, అందుకే థియేటర్లకు ఎప్పుడూ లాయల్‌గా ఉంటాను. అలా అబద్ధం చెప్పకపోతే నా సినిమా కలలు అక్కడే ఆగిపోయేవి," అని ఆయన వివరణ ఇచ్చాడు.

అన్నట్లుగానే జూన్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీని, ఆరు వారాల తర్వాత (ఆగస్టు 1న) యూట్యూబ్‌లో కేవలం రూ.100 రెంట్‌కు అందుబాటులోకి తెచ్చాడు. కానీ, ఇప్పుడు సైలెంట్‌గా మళ్లీ సోనీ లివ్ ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks