OTT Review: కెనడా వెళ్లాలనుకునేవారే టార్గెట్.. ఆర్గాన్ మాఫియా దందా.. మౌనీ రాయ్ కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

OTT Review: అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అబ్ హోగా హిసాబ్. ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటి మౌనీ రాయ్ నటించింది. కెనడా వెళ్లాలనుకునే వారినే లక్ష్యంగా చేసుకుంటూ ఆర్గాన్ మాఫియా చేసే ఆగడాల చుట్టూ తిరిగే సిరీస్ ఇది.

Published on: Jun 18, 2026, 15:27:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Review: కెనడా వెళ్లి భారీగా సంపాదించాలనే కలలు కనే అమాయక యువతను టార్గెట్ చేస్తూ సాగే ఒక భయంకరమైన ఆర్గాన్ ట్రాఫికింగ్ (అవయవాల అక్రమ రవాణా) బ్యాక్‌డ్రాప్‌తో అమెజాన్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్ ఒక సరికొత్త వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది.

OTT Review: కెనడా వెళ్లాలనుకునేవారే టార్గెట్.. ఆర్గాన్ మాఫియా దందా.. మౌనీ రాయ్ కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
OTT Review: కెనడా వెళ్లాలనుకునేవారే టార్గెట్.. ఆర్గాన్ మాఫియా దందా.. మౌనీ రాయ్ కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

అదే 'అబ్ హోగా హిసాబ్'. షహీర్ షేక్, సంజయ్ కపూర్, మౌని రాయ్ లాంటి క్రేజీ స్టార్ కాస్ట్‌తో డైరెక్టర్ దివ్యాన్షు మల్హోత్రా తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.

అబ్ హోగా హిసాబ్ అసలు కథేంటంటే?

ఈ కథ పంజాబ్ బ్యాక్‌డ్రాప్‌లో మొదలవుతుంది. బాబీ (షహీర్ షేక్) కెనడా నుంచి డిపోర్ట్ అయి ఇండియాకు తిరిగి వచ్చేస్తాడు. అక్కడ అతను పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు ఏంటనేది క్లియర్ గా చూపించకపోయినా, తనలాంటి మిడిల్ క్లాస్ వలస కార్మికులకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది హింట్ ఇస్తారు.

అయితే ఇండియాకు తిరిగి వచ్చిన బాబీ.. తన తమ్ముడు బంటి మనోచా (అవినాష్ మిశ్రా) భవిష్యత్తు బాగుండాలని, అతడిని ఎలాగైనా కెనడా పంపించాలని డిసైడ్ అవుతాడు. విదేశాల్లో వర్కింగ్ క్లాస్ ఇమ్మిగ్రెంట్స్ పడే నరకం తెలిసినా కూడా బాబీ తన తమ్ముడిని ఎందుకు పంపాలనుకున్నాడు అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.

ఇదే సమయంలో మనకు గోల్డీ (సంజయ్ కపూర్) పరిచయం అవుతాడు. విదేశాలకు వెళ్లాలనుకునే వందలాది మంది అమాయక యువకులకు ఆశ చూపి, వాళ్లకు మత్తు మందు ఇచ్చి వాళ్ల శరీరంలోని అవయవాలను అక్రమంగా విక్రయించే ఒక ప్రమాదకరమైన ఆర్గాన్ మాఫియా కింగ్‌పిన్ ఈ గోల్డీ. అతనికి కుడి భుజంగా, ఈ మొత్తం నెట్‌వర్క్‌ను కాపాడుతూ కామ్నా (మౌని రాయ్) ఉంటుంది.

మరోవైపు పంజాబ్‌లో వరుసగా మాయమవుతున్న యువకుల కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్‌స్పెక్టర్ దొసాంజ్ (హర్మాన్ సింఘా) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో బాబీ, బంటి జీవితాలు ఎలా మారాయి? ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అండ్ ఆర్గాన్ ట్రేడింగ్ ముఠా నుంచి వాళ్లు ఎలా తప్పించుకున్నారు? చివరకు ఎలాంటి రివెంజ్ తీర్చుకున్నారు అనేదే ఈ సిరీస్ కథ.

అబ్ హోగా హిసాబ్ ఎలా ఉందంటే?

సుదీప్ నిగమ్, నమిత్ శర్మ అందించిన ఈ కథలో మంచి సోషియో-పొలిటికల్ పాయింట్ ఉంది. కానీ దర్శకుడు దివ్యాన్షు మల్హోత్రా దానిని స్క్రీన్ మీద సరిగా ప్రెజెంట్ చేయడంలో కొంచెం తడబడినట్లు కనిపిస్తుంది. మొత్తం 10 ఎపిసోడ్‌ల పాటు సాగే ఈ సిరీస్‌లో క్యారెక్టర్ల మధ్య ఎమోషనల్ డెప్త్ మిస్ అయింది.

కేవలం డ్రామా, గందరగోళం, ట్విస్టులు యాడ్ చేయాలనే ఆరాటంలో కథను సాగదీశారు. క్రైమ్ థ్రిల్లర్ కు కావలసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వాతావరణం ఉన్నప్పటికీ, కథలో లాజిక్స్ చాలా చోట్ల మిస్ అయ్యాయి. పంజాబ్ నేటివిటీని చూపించడంలో కూడా దర్శకుడు కాస్త ఫెయిల్ అయ్యారు. కథనం చాలా చోట్ల ముందే ఊహించే విధంగా అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే?

ఈ వెబ్ సిరీస్‌కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా షహీర్ షేక్ మాత్రమే. బాబీ పాత్రలో తను చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కథనంలో లోపాలు ఉన్నా కూడా తన యాక్టింగ్‌తో సిరీస్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు.

తమ్ముడిగా చేసిన అవినాష్ మిశ్రా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, తన ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. విలన్‌గా సంజయ్ కపూర్ తన మార్క్ చూపించగా, మౌని రాయ్ పాత్రకు అంత స్కోప్ దక్కలేదు. పోలీస్ ఆఫీసర్‌గా హర్మాన్ సింఘా ఓకే అనిపించారు.

ప్లస్ పాయింట్స్

* షహీర్ షేక్, అవినాష్ మిశ్రా పెర్ఫార్మెన్స్

* ఆర్గాన్ మాఫియా బ్యాక్‌డ్రాప్ లైన్

మైనస్ పాయింట్స్

* 10 ఎపిసోడ్‌ల సాగదీత కథనం

* ఎమోషనల్ డెప్త్ లేకపోవడం

* ముందే ఊహించగలిగే సీన్స్

రివెంజ్ డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు వీకెండ్‌లో టైమ్ పాస్ కోసం ఈ సిరీస్‌ను ఒకసారి ట్రై చేయవచ్చు. కానీ భారీ అంచనాలతో చూస్తే మాత్రం నిరాశ తప్పదు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More